Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ న్యూస్... 76,578 ఉద్యోగాలు భర్తీకి కేంద్రం రెడీ..

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (22:06 IST)
కేంద్ర పారా మిలిటరీ బలగాల్లో 76,578 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. వీటిలో 54,953 కానిస్టేబుల్‌ పోస్టులు ఉండగా, మహిళల కోసం 7,646 పోస్టులను కేటాయించినట్లు వెల్లడించింది. అయితే వీటిలో కానిస్టేబుల్ పోస్టుల్లో అత్యధికంగా సీఆర్పీఎఫ్‌లో 21,566 ఖాళీలు ఉండగా, బీఎస్‌ఎఫ్‌(16,984), ఎస్‌ఎస్‌బీ(8,546), ఐటీబీపీ(4,126) అస్సాం రైఫిల్స్‌(3,076)లో ఉన్నట్లు తెలియజేసింది. 
 
వీటి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) 2019, ఫిబ్రవరి 11 నుంచి మార్చి 11 వరకు కంప్యూటర్ ఆధారిత ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ని నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా సబ్ఇన్‌స్పెక్టర్ హోదాలో 1,073 పోస్టులు ఉండగా వాటిలో బీఎస్‌ఎఫ్‌లో 508, సీఆర్పీఎఫ్‌లో 274, ఎస్‌ఎస్‌బీలో 206, ఐటీబీపీలో 85 ఖాళీలు ఉన్నాయి. 
 
వీటితో పాటుగా హోంశాఖ, ట్రేడ్స్‌మెన్, వైద్యం, పారా మెడికల్, కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ రంగాల్లో మరో 20,086 పోస్ట్‌లను పదోన్నతుల ఆధారంగా భర్తీ చేయనుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments