Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయన గాఢ నిద్రలో వున్నాడు.. చంపేద్దాం రా... ప్రియుడితో కలిసి...

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (21:31 IST)
అక్రమ సంబంధాలు అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఒక మహిళ తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి అంత్యక్రియలు కూడా జరిపించింది. కానీ నిజం ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే బాబాఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో భార్య జహీదాతో కలిసి నివాసం ఉంటున్నాడు. 
 
కొంతకాలంగా అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి బంధానికి భర్త అడ్డు వస్తుండటంతో అతడిని హతమార్చాలని పన్నాగం పన్నింది. బాబాఖాన్ తన ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో మా ఆయన నిద్రమత్తులో వున్నాడు.. వచ్చేయ్ చంపేద్దువుగాని అని ప్రియుడిని అతని స్నేహితులను పిలిపించి గొంతు నులిమి దారుణంగా హత్య చేయించింది. 
 
చట్టానికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవాలని ప్రయత్నించింది. ఏమీ ఎరగనట్లు అంత్యక్రియలు కూడా జరిపించింది. మృతుని మరణం పట్ల మరియు ఆమె ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శవాన్ని తిరిగి వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించగా గొంతు నులిమి చంపినట్లు తేలింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని జహీదాను విచారించారు. దాంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడనే ప్రియుడితో కలిసి ఒంటి గంట సమయంలో హత్య చేయించానని వెల్లడించింది. ఈ దారుణంలో పాలుపంచుకున్న ఆమెను, ప్రియుడిని వారితోపాటు మరో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments