Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణ ఎంసెట్ తుదిదశ కౌన్సెలింగ్

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (10:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం చేపట్టిన కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా శనివారం తుది విడత కౌన్సెలింగ్ జరుగనుంది. దీనికి సంబంధించి శని, ఆదివారాల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇంజినీరింగ్ తుదివిడుత కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరయ్యే విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఇదే అంశంపై ఎంసెట్ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ, ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు స్లాట్‌ కూడా స్వయంగా వారే బుకింగ్ చేసుకోవాలిస ఉంటుందన్నారు. స్లాట్ బుకింగ్ అనంతరం ఈ నెల 8న అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలిస్తామని వెల్లడించారు. 
 
ధ్రవపత్రాల పరిశీలన అనంతరం ఈనెల 9 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని.. 12న తుది విడత సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈనెల 12-15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, వెంటనే అడ్మిషన్ పొందిన కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కూడా చేయాల్సి ఉంటుందన్నారు. సీటు రద్దు చేసుకోవడానికి ఈ నెల 18 వరకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
 
తుదివిడత కౌన్సెలింగ్ అనంతరం.. ఈనెల 20 నుంచి స్పెషల్ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు మిట్టల్ వెల్లడించారు. దీని కోసం.. ఈనెల 20, 21 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాలని.. దీనికి సంబంధించి 24న సీట్లు కేటాయిస్తామన్నారు. దీనికి హాజరయ్యే అభ్యర్థులు 24 నుంచి 26 వరకు వెబ్‌సైట్‌ ద్వారా ట్యూషన్‌ ఫీజు చెల్లించాలన్నారు. 24 నుంచి 26 వరకు అడ్మిషన్ పొందిన వారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట.. పొద్దు తిరుగుడు పువ్వు అంట..? (video)

సంధ్య థియేటర్ తొక్కిసలాట : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా

సీఎం రేవంత్‌తో చర్చించని విషయాలను కూడా రాస్తున్నారు : దిల్ రాజు

Raha: అలియా భట్‌ను మించిపోయిన రాహా.. క్యూట్‌గా హాయ్ చెప్తూ.. (వీడియో వైరల్)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments