తెలంగాణ రాష్ట్రంలో సెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఈసెట్ పరీక్ష మొదలుకానుంది. ఎంసెట్ పరీక్షలు 4వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. వీటితో పాటు.. పిజి సెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్ ఇలా అన్ని పరీక్షలు ఆగస్టు నెలలో ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టిఎస్ ఈసెట్)-2021 ఇవాళ జరుగనుండగా.. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
సిబిటి (కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్) విధానంలో మొదటి సెషన్ ఎగ్జామ్ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
హాల్ టిక్కెట్ పై ఇచ్చిన సూచనలను పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా పాటించాలని, లేకపోతే విద్యార్థులను పరీక్ష హాల్ లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న సెట్ ఎగ్జామ్స్ వివరాలు..
ఆగస్టు 3వ తేదీన ఈసెట్ పరీక్ష జరుగనుంది.
ఆగస్టు 4 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు.. 9,10 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
11వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షను నిర్వహించనున్నారు.
ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ నిర్వహిస్తారు.
ఆగస్ట్ 23 వ తేదీన లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆగస్ట్ 24, 25 తేదీల్లో ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.