జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలను వాయిదా వేయండి.. సోనూసూద్ డిమాండ్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (14:11 IST)
Sonu Sood
జేఈఈ మెయిన్ సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, నీట్ సెప్టెంబర్ 13న జరగనుంది. అదేవిధంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్‌ 27న జరగనుంది. కరోనా అనుమానితులకు ఐసోలేషన్ గదిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలను వాయిదా వేయాలని ఆయనేకమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న జేఈఈ, నీట్‌ పరీక్షలను డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్షలు రాయాలని బలవంతం చేయకూడదని, ఈ పరీక్షలు మరో 2 నెలలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. వారు మానసికంగా సిద్ధమైనప్పుడే పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలు రాసే చాలామంది పిల్లలు వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్నారన్నారు. ఇలాంటి సమయంలో వారిని పరీక్షలు రాయమనడం కరెక్ట్ కాదని తెలిపారు. 
 
అయితే సోనూసూద్ చేసిన ఈ డిమాండ్‌పై అనేకమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మద్దతు పలుకుతున్నారు. 26 లక్షల మంది విద్యార్థుల గొంతు సోనూసూద్ అని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments