Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో వెళ్తున్న కొత్త పెళ్లికూతురు, వధువుకు ఎదురుగా వచ్చి ముద్దుపెట్టిన ప్రియుడు, ఆ తర్వాత?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (13:55 IST)
పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించి.. వేరొకరితో తాళి కట్టించుకుంది ఓ యువతి. మూడు గంటల ముచ్చటగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వరుడి ముందే కొత్త పెళ్లి కూతురుకు ప్రియుడు ముద్దు పెట్టాడు. అంతే అందరూ షాక్ అయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరా బాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హూజూరాబాద్‌కు చెందిన యువతికి, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. 
 
వధువు ఇంతకు ముందే హుజూరాబాద్‌కు చెందిన వంశీ అనే యువకుడిని ప్రేమించింది. తల్లితండ్రుల మాట కాదనకుండా మందమర్రి కుర్రాడితో పెళ్లికి ఒప్పుకుంది. ఈ విషయం తెలిసిన ప్రియుడు వంశీ, సదరు యువతితో కలిసి ఉన్న ఫోటోలు, ప్రేమ లేఖలు మందమర్రి వరుడికి పంపించి పెళ్లి చేసుకోవద్దు అని బెదిరించాడు. అయినా ఇవేవి పట్టించుకోని వధూవరుల తల్లితండ్రులు సోమవారం పెళ్ళి జరిపించారు. 
 
పెళ్లితంతు అంతా ముగించుకుని వధువు అత్తారింటికి బయలుదేరింది. ఈలోగా వధువు ఇచ్చిన సమాచారంతో జమ్మికుంట రోడ్డులో ప్రియుడు వంశీ వీరి వాహనాన్ని అడ్డుకున్నాడు. వారి అందరి ముందే వధువుకు ముద్దు పెట్టి.. వధువును వదిలి పెట్టి వెళ్లాలని వారితో గొడవకు దిగాడు. దీంతో వరుడి తరుఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. 
 
అర్థరాత్రి వరకు కౌన్సెలింగ్ నిర్వహించినా.. ఇరువర్గాల వారు వినకపోవటంతో వరుడు, వధువును పోలీసు స్టేషన్‌లోనే వదిలేసి మందమర్రి వెళ్లిపోయాడు. ఇటు వధువు తల్లి తండ్రులు సైతం వధువును పోలీసు స్టేషన్‌లోనే వదిలేసి వెళ్లారు. పోలీసులు వధువును కరీంనగర్‌లోని స్వధార్ హోమ్‌కు తరలించారు. ముద్దు పెట్టుకుని గొడవకు కారణమైన ప్రియుడు వంశీపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments