Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీన్ రివర్స్.. నా భార్య నాకు కావాలంటూ.. భర్త ధర్నా.. మౌనపోరాటం

Advertiesment
karimnagar
, ఆదివారం, 26 జులై 2020 (14:29 IST)
భార్యల్ని మోసం చేసే భర్తలను చూసివుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. నా భార్య నాకు కావాలంటూ.. ఓ భర్త ధర్నాకు దిగాడు. అది కూడా భార్య ఇంటి ఎదుట మౌనపోరాటం చేస్తున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట ప్రాంతానికి చెందిన రామ్‌కరణ్ పెద్దలను ఎదిరించి తాను ప్రేమించిన లేఖ యువతిని 2014 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వివాహం అయిన కొద్దిరోజుల పాటు కాపురం సజావుగానే సాగింది. అనంతరం భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో లేఖ మంచిర్యాలలోని జన్మభూమినగర్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
 
ఆ మనస్పర్ధలు కాస్త విడాకుల వరకు దారితీసింది. తాము విడిపోయేందుకు లేఖ తల్లిదండ్రులే కారణమంటూ రామ్‌కరణ్‌ ఆరోపిస్తున్నాడు. తన భార్యకు కౌన్సిలింగ్ ఇప్పించాలని, నా భార్య నాక్కావాలంటూ భార్య ఇంటి ఎదుట బైఠాయించాడు.
 
న్యాయం జరిగేంత వరకు ఇక్కడే కూర్చుంటానని, అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలంటూ చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని భార్య, భర్తలకు కౌన్సిలింగ్ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం...