బహుశా ఏ రాజకీయ పార్టీ నాయకుడికి గానీ, ఏ నటుడికి గానీ ఇంతమంది అభ్యర్థనలు వెళ్లివుండకపోవచ్చు. కరోనావైరస్ లాక్ డౌన్ కాలం నుంచి బాలీవుడ్ విలన్ పాత్రలు పోషించే సోనూ సూద్ హీరో అయిపోయారు. కష్టంలో వున్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటూ రియల్ హీరో అయ్యారు. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నా తానున్నాంటూ వాలిపోతున్నారు.
ఇటీవలే చిత్తూరు జిల్లాలో ఓ రైతు వ్యవసాయానికి ఎడ్లు లేక కుమార్తెలతో నాగలి దున్నడాన్ని చూసి వెంటనే అతడికి ట్రాక్టర్ కొని ఇచ్చాడు. ఇలా ఎంతోమందికి తనవంతు సాయం చేస్తూనే వున్నారు. ఈ క్రమంలో ఆయనకు వేల సంఖ్యలో సాయం చేయమంటూ అభ్యర్థనలు వస్తున్నాయి.
ఈ రోజు ఉదయం సోనూ సూద్‌కి 1137 మెయిల్స్, 19000 ఫేస్ బుక్ మెసేజ్‌లు, 4812 ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు, 6741 ట్వీటర్ మెసేజ్‌లు వచ్చాయి. తనకు రోజూ దాదాపు ఇదే స్థాయిలో మెసేజ్‌లు వస్తున్నాయనీ, మనిషిగా సాధ్యమైనంత మందికి సాయం చేస్తున్నాననీ, ఎవరికైనా సాయం అందించలేకపోతే క్షమించండండి అంటూ ట్వీట్ చేశారు ఈ హీరో.