2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రకటించిన షివ్ నాడర్ యూనివర్శిటీ

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (21:15 IST)
షివ్ నాడర్ యూనివర్శిటీ, భారతదేశపు అతి పిన్న ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (IoE), 2024-25 కోసం అడ్మిషన్స్ ఆరంభించింది. ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, మేనేజ్మెంట్, ఎంటర్ ప్రిన్యుషిప్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో తన నాలుగు స్కూల్స్‌లో యూనివర్శిటీ అన్ని ప్రోగ్రాములకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తు పత్రం యూనివర్శిటీ వారి అధికారిక వెబ్‌సైట్ snu.edu.in/homeలో అందుబాటులో ఉంటుంది.
 
గ్రేడ్ 12లో తమ సంబంధిత పాఠశాలల్లో చదువులో ప్రతిభ చూపించిన విద్యార్థుల కోసం2024-25 విద్యా సంవత్సరానికి గాను, యూనివర్శిటీ విద్యార్థుల కోసం కొత్త ఉపకారవేతనం పరిచయం చేసింది. ఉపకార వేతనాలు గురించి వివరాలు ఈ వెబ్ సైట్ లింక్ snuadmissions.comలో అందుబాటులో ఉన్నాయి.
 
“రాబోతున్న విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు అందుబాటులో ఉండటం వలన, తాము ఎంచుకున్న రంగాలలో శ్రేష్టతను సాధించగోరే అభిలాషణీయమైన ప్రతిభ గల వ్యక్తులను మేము కుతూహాలంగా ఆహ్వానిస్తున్నాం. చదువును మించి మా సంస్థ ఆవిష్కరణ, సంక్లిష్టమైన ఆలోచన, సమగ్రమైన ఉద్వేగభరితమైన, శారీరక సంక్షేమాన్ని పోషిస్తుంది,” అని డాక్టర్. అనన్య ముఖర్జీ, వైస్ ఛాన్సలర్, షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్సీఆర్ అన్నారు.
 
ద షివ్ నాడర్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అత్యంత విజయవంతమైన కెరీర్ డెవలప్మెంట్ సెంటర్(సీడీసీ)కి కేంద్రంగా ఉంది. గత ఏడాది, యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేట్స్‌ను ప్రముఖ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్ శాక్స్, పీడబ్ల్యూసీ, యూబీఎస్, పాలో ఆల్టో, సిలికాన్ ల్యాబ్స్, మెకిన్సే, ఎల్ & టీ, ఎయిర్ బస్, హోండా, జేకే టైర్స్ మొదలైన సంస్థలు నియామకం చేశాయి.
 
భారతదేశం, విదేశాల్లో ప్రముఖ సంస్థలలో షివ్ నాడర్ యూనివర్శిటీకి చెందిన అధిక సంఖ్యాక గ్రాడ్యుయేట్స్ ఉన్నత విద్యను నేర్చుకుంటున్నారు. తమ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను పూర్తి చేసిన తరువాత కొంతమంది నేరుగా పీహెచ్‌డీ ప్రోగ్రాములు సంపాదిస్తున్నారు. ఇది యూనివర్శిటీ యొక్క నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధనా డిగ్రీ యొక్క విలువను, అంతర్జాతీయంగా పోటీయుత ప్రతిభను పోషించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. 2011లో స్థాపించబడిన, యూనివర్శిటీ సుమారు 3000 మంది విద్యార్థులు, 250+ బోధనా సిబ్బందితో 286 ఎకరాల గురుకుల క్యాంపస్‌లో విస్తరించింది.  దీనికి 2022లో ‘ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ హోదా లభించింది.
 
విద్యార్థుల కోసం బహుళ ప్రయోజనాలు
యూనివర్శిటీకి తమ సంబంధిత రంగాలలో సుసంపన్నమైన మరియు విభిన్నమైన అనుభవంతో అంతర్జాతీయంగా పేరు పొందిన బోధనా సభ్యులు ఉన్నారు. నేర్చుకోబడే అవకాశాలు తరగతి గదిని మించి 50+ క్లబ్స్ మరియు సొసైటీలతో ఉన్నాయి. కొన్ని ప్రముఖ క్లబ్స్‌లో సుస్థిరత, మోడల్ యునైటెడ్ నేషన్స్, కృత్రిమ మేధస్సు, ఫోటోగ్రఫీ, రోబోటిక్స్, ఇంకా ఎన్నో వాటి కోసం సహకార డిజైన్స్ ఉన్నాయి.
 
క్రీడలు- శారీరక సంక్షేమం యూనివర్శిటీ సాధనలో, అభివృద్ధిలో ఒక అంతర్భాగం. ఇది ప్రపంచ స్థాయికి చెందిన క్రీడా సదుపాయాలకు మరియు విద్యార్థులకు లభించే కార్యకలాపాల ఎంపికకు నిలయం. వీటిలో 90,000 చదరపు అడుగుల గొప్ప ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు 5,71,410 చదరపు అడుగుల అంతర్జాతీయ స్టాండర్డ్ అవుట్ డోర్ క్రీడా మైదానాలు మరియు స్క్వాష్, బ్యాడ్మింటన్, ఈక్విస్ట్రియాన్ శిక్షణ మొదలైన బహుళ ఆప్షన్స్ ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments