Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీబీఎస్ అభ్యర్థులకు కేంద్రం శుభవార్త - నీట్ పీజీ 2023 గడువు పెంపు

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (09:24 IST)
ఎంబీబీఎస్ అభ్యర్థులకు శుభవార్త. నీటీ పీజీ 2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించింది. ఆ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని ఆగస్టు 11వ తేదీ వరకు కేంద్రం పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది. పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
ఈ యేడాది మార్చి 31వ తేదీ నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేవారే నీట్ పీజీ 2023 పరీక్షకు అర్హులని తొలుత ప్రకటించారు. ఈ కటాఫ్ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తూ గత నెల 13వ తేదీన నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ గత యేడాది ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ యేడాది జూన్ 30వ తేదీ లోపు అది పూర్తయ్యే అవకాశం లేదు. ఫలితంగా చాలా మంది విద్యార్థుల నీటీ పీజీ పరీక్షకు దూరమయ్యే అవకాశాలు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల వినతి మేరకు కేంద్ర ఈ గడువును ఆగస్టు 11వ తేదీ వరకు పొడగించింది. 
 
తాజా నిర్ణయంతో తెలంగాణలోని దాదాపు 4 వేలమంది విద్యార్థులు సహా పలు రాష్ట్రాల అభ్యర్థులందరికీ ఉపశమనం లభించినట్లయింది. వీరంతా గురువారం నుంచి ఆదివారం (ఈ నెల 12) వరకు నీట్‌ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మార్చి 5న జరగనుంది. దాన్ని వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు విన్నవిస్తున్నాయి. 
 
మరోవైపు- ఎండీఎస్‌ నీట్‌ రాసేందుకు వీలుగా బీడీఎస్‌ విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ తేదీని ఈ ఏడాది జూన్‌ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఎండీఎస్‌ నీట్‌ అభ్యర్థులు శుక్రవారం (ఈ నెల 10) సాయంత్రం 3 గంటల నుంచి ఆదివారం (ఈ నెల 12) అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
నీట్‌- సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు అర్హత ప్రమాణాన్ని 50 పర్సంటైల్‌ నుంచి 20 పర్సంటైల్‌కు కేంద్రం తగ్గించింది. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)తో సంప్రదింపుల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments