Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

1105 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన యూపీఎస్సీ

Advertiesment
Jobs
, గురువారం, 2 ఫిబ్రవరి 2023 (14:31 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన 1105 ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అహ్వానిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023.. మొత్తం ఖాళీలు 1105. విద్యార్హత.. ఏదేని డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. అభ్యర్థుల వయోపరిమితి 2023 ఆగస్టు ఒకటో తేదీ నాటికి 21 యేళ్లు నిండివుండాలి. 32 యేళ్లకు మించివుండరాద. అంటే 02-08-1991 నుంచి 01-08-2023 మధ్య జన్మించి వుండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పరీక్ష రాసేందుకు జనరల్ అభ్యర్థులకు ఆరు, ఓబీసీ, దివ్యాంగులకు తొమ్మిది, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అపరిమిత సంఖ్యలో రాసుకోవచ్చు. 
 
అభ్యర్థులు ఆన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ, ఇతర అభ్యర్థులు రూ.100, ఎస్టీ ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించనక్కర్లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లలో ప్రాథమిక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అలాగే, ప్రధాన పరీక్షా కేంద్రాలను మాత్రం విజయవాడ, హైదరాబాద్ నగరాల్లోనే ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ సర్కారు సీరియస్.. రంగంలోని ఇంటెలిజెన్స్