Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

ఏపీలో స్పెషలిస్టు వైద్య ఉద్యోగాల కోసం నోటిఫికేషన్

Advertiesment
doctor
, మంగళవారం, 16 ఆగస్టు 2022 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్ (ఏపీవీవీపీ) వివిధ ఆస్పత్రుల్లో 351 స్పెషలిస్టు వైద్య పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
పీజీ, డిప్లొమో, డీఎన్‌బీ కోర్సులలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 42 యేళ్లకు మించరాదు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి నెలకు రూ.61 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం అందజేస్తారు. 
 
దరఖాస్తు రుసుం జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను https://dmeaponline.com అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 
 
పోస్టుల వివరాలను పరిశీలిస్తే, జనరల్ మెడిసిన్ విభాగంలో 75 పోస్టులు, ఎనస్థీషియాలో 60, గైనకాలజీ విభాగంలో 60, పీడియాట్రిక్స్‌లో 1, జనరల్ సర్జరీలో 57, రేడియాలజీలో 27, పాథాలజీలో 9, ఈఎన్టీలో 9, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో 3 చొప్పున ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు : సీఈవో భవీశ్ అగర్వాల్