ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చివేయాలి : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (09:01 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌‍ను నక్సలైట్లు పేల్చివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను చేపట్టిన "హత్ సే హాత్ జోడో" పాదయాత్రలో భాగంగా ఆయన ములుగులో పర్యటిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అందుబాటులో లేని ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చివేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. 
 
హైదరాబాద్ నడిబొడ్డున 10 ఎకరాల స్థలంలో రూ.2 వేల కోట్లతో నిర్మించిన 150 గదుల ప్రగతి భవన్ కేవలం సంపన్న ఆంధ్ర పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలికేందుకు మాత్రమే ఉపయోగపడుతోందని, పేదలకు అందుబాటులో లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్‌లో పేద ప్రజలకు న్యాయం జరగదని రేవంత్ రెడ్డి అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాస్తవ ఘటన ఆధారంగా అభినయ కృష్ణ కామాఖ్య చిత్రం

కొడుకు వల్ల బిక్షాటన చేస్తున్న పెద్దాయన కథ ఆదారంగా దూరదర్శిని చిత్రం

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం ఆలస్యానికి కారణం అదే అన్న నిర్మాత

Bhavana: రేప్ మర్డర్ నేపద్యం గా భావన నటించిన డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ తెలుగులో సిద్ధం

Manjula: అగధ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

ఆరోగ్యకరమైన పనితీరుకు ఎర్గోనామిక్స్ కీలకం: ప్రముఖ ఎర్గోనామిక్స్ నిపుణుడు మను నెల్లుట్లచే నాట్స్ వెబినార్

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

తర్వాతి కథనం
Show comments