Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చిన కాంగ్రెస్

komatireddy venkatareddy
, ఆదివారం, 11 డిశెంబరు 2022 (13:45 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం తేరుకోలేని షాకిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీఎస్‌పీసీసీ)కి కొత్త నిర్వాహకులను తాజాగా ప్రకటించిది. ఇందులో కోమటిరెడ్డికి స్థానం కల్పించలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలే ఇందుకు కారణమై వుంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
 
టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని, మాణిక్ ఠాగూర్ ఛైర్మన్‌గా పొలిటికల్ అఫైర్ కమిటీలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పీసీసీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రెండు కమిటీల్లోనూ చోటు దక్కకపోవడం గమనార్హం. 
 
ఈయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడిపోయారు. ఆ సమయంలో వెంకట్ రెడ్డి తన సోదరుడు విజయానికి పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. 
 
పైగా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన ఏమాత్రం పొసగడంలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు పార్టీలో తారాస్థాయికి చేరాయి. వీటిపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన కమిటీలో వెంకట్ రెడ్డికి చోటు కల్పించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవిత వద్ద సీబీఐ విచారణ ప్రారంభం