Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిమ్స్ పీజీ పరీక్షల్లో టాపర్‌గా గుంటూరు వైద్యురాలు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (11:02 IST)
అఖిల భారత వైద్య విజ్ఞాన మండలి (ఎయిమ్స్) నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షల్లో గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసించిన వినీత, జూన్ 11న నిర్వహించిన పరీక్షల్లో తొలి స్థానంలో నిలిచారు. వినీతతో పాటు మరో ఆరుగురికి కూడా నూటికి నూరు మార్కులూ వచ్చాయి.
 
ఎయిమ్స్ నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో పీజీ పరీక్షలు ఒకటి. ఈ పరీక్షల్లో టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ వినీత చెప్పుకొచ్చారు. తాను పీజీలో జనరల్ మెడిసిన్‌ను ఎంచుకోనున్నానని, గత సంవత్సరం డిసెంబర్‌లోనే తన ఎంబీబీఎస్ పూర్తయిందని తెలిపారు. 
 
ఈ పరీక్షల కోసం కష్టపడ్డానని, ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. తన పీజీ విద్యను ఢిల్లీ ఎయిమ్స్ లేదా చండీగఢ్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో గానీ పూర్తి చేస్తానని ఆమె అంటున్నారు. 
 
'పీజీలో ప్రవేశం కోసం ఆరు నెలల క్రితమే ప్రిపరేషన్‌ను మొదలు పెట్టాను. ఎంబీబీఎస్ కోర్సులోని స్టడీ మెటీరియల్సును మరోసారి చదువుకున్నాను. ఓ యాప్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు తీసుకుని పరీక్షకు హాజరయ్యాను' అని వివరించారు. 
 
కాగా, పీజీ ఎంట్రెన్స్‌లో మొత్తం 4,335 మంది ర్యాంకులను అందుకున్నారు. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చదువుతున్న 74 మందికి ర్యాంకులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిమ్స్‌ల్లో చదువుతున్న 29 మందికి వందకు వంద మార్కులు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments