Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ ప్రభాకర్ రెడ్డి - అస్మిత్ రెడ్డిలకు తేరుకోలేని షాక్!

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (10:56 IST)
బీఎస్-3 సిరీస్ వాహనాల కొనుగోలు స్కామ్‌లో అరెస్టు అయిన అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు తేరుకోలేని షాక్ తగిలింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అలాగే, వీరిని విచారించేందుకు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. 
 
బీఎస్ 3 వాహనాల కొనుగోలు కోసం నకిలీ ఎన్.ఓ.సీలు సృష్టించడం, సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే గతంలో పెండింగులో మరో రెండు కేసుల్లో కూడా వీరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వీరిని కోర్టులో హాజరుపరచగా, ప్రస్తుతం వీరికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. 
 
ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ అనంతపురం కోర్టులో పిటిషన్లను వారిద్దరూ వేర్వేరుగా దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అదేసమయంలో పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. అయితే, న్యాయవాదుల సమక్షంలోనే నిందితులను విచారించాలని కోర్టు ఆదేశాలు జారీచేయడం వారికి కాస్త ఊరటకలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments