Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రవేశాల కోసం రిటన్ టెస్ట్ తేదీల ఖరారు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:56 IST)
దేశంలో 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాల కోసం ప్రతి యోడాది సీయూసెట్‌‌ పేరుతో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ యేడాది ఈ పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. 
 
ఇందులోభాగంగా, సెప్టెంబర్‌ 15, 16, 23, 25 తేదీల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు సెప్టెంబర్‌ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ప్రవేశపరీక్ష ద్వారా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అండర్‌గ్రాడ్యుయేట్‌, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశపరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నది.
 
సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ తమిళనాడు, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ కర్ణాటక, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ కేరళ, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ గుజరాత్‌, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ హర్యానా, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ జార్ఖండ్‌, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ సౌత్‌ బీరార్‌, అస్సాం యూనివర్సిటీ, సిల్సార్‌లు ఉండగా, హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోదలచిన వారు cucet.nta.nic.in, nta.ac.in అనే వెబ్‌సైట్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments