Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీవీ, ఫ్రిజ్, ఏసీలు కొనాలని వుందా? వెంటనే కొనేయండి, లేదంటే...?

Advertiesment
semiconductors chips shortage
, మంగళవారం, 30 మార్చి 2021 (14:26 IST)
కరోనా మహమ్మారి రకరకాలుగా దెబ్బలు వేస్తోంది. తాజా దెబ్బ ఎలక్ట్రానిక్స్ రంగం పైన వేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు విధిస్తున్న లాక్ డౌన్లు కారణంగా ఇటీవలి కాలంలో విపరీతంగా మొబైల్, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయింది. వీటి తయారీకి ఎలక్ట్రానిక్ చిప్స్ అధికంగా ఉపయోగించినట్లు తేలింది.
 
వీటి కోసం వినియోగం ఎక్కువవడంతో మిగిలిన గృహోపకరణాలకు ఈ చిప్స్ కొరత విపరీతంగా వున్నట్లు నిపుణులు చెపుతున్నారు. కనీసం 25 శాతం మేర ఎలక్ట్రానిక్స్ చిప్స్ కొరత ఏర్పడిందని అంటున్నారు.
 
ఈ ప్రకారం రాబోయే రోజుల్లో టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, కార్లు కొనాలనుకునేవారికి ధర పెనుభారం అయ్యే అవకాశం వుందని చెపుతున్నారు. కనుక ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకునేవారు త్వరపడి కొనుగోలు చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ చిప్స్ కొరత సమస్య ఎప్పటికి తీరుతుందో అంచనా వేయలేకపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌కు ఇంకా పెళ్ళికాలేదు.. అమ్మాయిలూ ఆయన ముందు వంగకండి...