Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌హిళా వి.ఆర్.ఓ.పై అసభ్యకర ప్ర‌వ‌ర్త‌న; కానిస్టేబుల్ స‌స్పెన్ష‌న్

Advertiesment
Obscene conduct
, శనివారం, 31 జులై 2021 (14:59 IST)
ప్రజలకు ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చిన వెంటనే గుర్తుకు వచ్చేది పోలీస్. అలాంటి అపార నమ్మకం కలిగిన పోలీసింగ్ ను ప్రజలకు చేరువ చేయాలంటే వారితో మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాల‌ని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. అలా కాకుండా పోలీసు ప్రతిష్టను భ్రష్టు పట్టించేలా సిబ్బంది వ్యవహరిస్తే, క్రమశిక్షణారాహిత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
గంపలగూడెం పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రామకృష్ణను జిల్లా ఎస్పీ స్పెండ్ చేశారు. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న రామ‌కృష్ణ కొంత కాలంగా అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు. విధుల పట్ల అలసత్వం వహించడమే కాక, ఆ ప్రాంత మహిళ వి.ఆర్.ఓ తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు.

ఆమె తల్లి తో కూడా అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందిపాలు చేస్తున్నాడని ఎస్పీ కి ఫిర్యాదు అందింది. త‌న దృష్టికి రాగా, క్షణ మాత్రం ఆలస్యం చేయకుండా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు జిల్లా ఎస్పీ. ఇవే కాక అతనిపై గతంలో కూడా పలు ఆరోపణలు వ‌చ్చాయి. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవి నిజ‌మేన‌ని నివేదిక‌లో తేల‌డంతో కానిస్టేబుల్ పైన సస్పెన్షన్ విధిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

300 వీధి కుక్కలకు విషం.. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు