Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతు భరోసా కేంద్రం ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సింహాద్రి

Advertiesment
రైతు భరోసా కేంద్రం ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సింహాద్రి
, శనివారం, 31 జులై 2021 (13:00 IST)
కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రం ప్రచార రథాన్ని అవ‌నిగ‌డ్డ‌ సింహాద్రి రమేష్ బాబు శనివారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ ప్రచార రథం ద్వారా ప్రదర్శించిన వీడియోని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఏ.డి. ఏ జి.వెంకటమణితో పాటు పలువురు నాయకులు  రైతులు తిలకించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు  వ్యవసాయం సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కేంద్రాలు ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ప్రయోజనం కోసం సీఎం జగన్మోహనరెడ్డి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరావు,  మండల పార్టీ కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, వ్యవసాయ మిషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఛైర్మన్ సామర్ల  రాముడు, ఉప సర్పంచ్ గాజుల జై  గోపాల్  మాజీ సర్పంచ్ సైకం బాబూరావు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తప్పించుకుని విజయవాడ వచ్చేందుకు ఆర్టీసీ బ‌స్సు ఎక్కాం: మాజీ ఎమ్మెల్యే అనిత‌