Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు డీఎస్సీ-2008 క్వాలిఫై అభ్యర్థులకు కౌన్సెలింగ్

Webdunia
శనివారం, 10 జులై 2021 (08:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2008లో నిర్వహించిన డీఎస్సీ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాలు నియామక ఉత్తర్వులివ్వనున్నాయి. 
 
డీఎస్సీ-2008కి సంబంధించి నియామక ప్రక్రియ మార్పు కారణంగా నిలిచిపోయిన 2,193 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ)లను మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌(ఎంటీఎస్‌)తో కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వీరి నియామక ఉత్తర్వులు జారీచేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టరేట్‌ శుక్రవారం జారీ చేశారు. జిల్లాల డీఈవోలు ఈ నెల 10న అర్హత కలిగిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. 
 
విద్యాశాఖ జారీచేసిన మార్గదర్శకాలు ఇలా వున్నాయి.. 
 
* బదిలీ జరిగినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు అందుబాటులో లేని 3, 4 కేటగిరీలలోని ఖాళీలలో నియమించాలి.
 
* విద్యార్థులు ఉండి, ఉపాధ్యాయులు లేని 3, 4 కేటగిరీలలోని ఖాళీలలో నియమించవచ్చు. 
 
* 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులుండి, బ్లాక్‌ చేయని 3, 4 కేటగిరీలలోని ఖాళీలను వీరితో భర్తీ చేయవచ్చు. 
 
* నియమించవలసిన ఉపాధ్యాయులకు ఖాళీలు సరిపోకుంటే కేటగిరీ-4లోని ఖాళీలను భర్తీ చేయాలి. 
 
* అయినప్పటికీ పోస్టులు చాలకపోతే.. కేటగిరీ-3లో బ్లాక్‌ చేసిన ఖాళీలలో భర్తీ చేయవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments