Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజల సొమ్మును రూ.లక్షల్లో వేతనంగా తీసుకుంటూ రాజకీయాలా?

Advertiesment
ప్రజల సొమ్మును రూ.లక్షల్లో వేతనంగా తీసుకుంటూ రాజకీయాలా?
, శుక్రవారం, 9 జులై 2021 (14:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న ముఖ్య సలహాదారులు, సలదారులు రాజకీయాలు మాట్లాడటంపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల చెల్లించే పన్నులను లక్షలాది రూపాయలుగా వేతనాలు తీసుకుంటూ మీడియా ముందుకు వచ్చిన రాజకీయాలు మాట్లాడటమేమిటని, ఇది చట్ట వ్యతిరేకం కాదా అని ప్రశ్నించింది. 
 
అస్సలు ముఖ్య సలహాదారులు, సలహాదారుల నియామక విధి విధానాలు, విధులకు సంబంధించిన వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్‌ఈసీ నీలం సాహ్ని నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా వ్యాజ్యంలోని వివరాలు, ప్రతివాదులు దాఖలు చేసిన కౌంటర్లలోని అంశాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. ప్రతీ శాఖకు ఓ మంత్రి ఉండగా ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సలహాదారులు సమీక్ష సమావేశాలు నిర్వహించవచ్చా అని ఆరా తీశారు. 
 
పైగా మీరు అడ్వకేట్‌ జనరల్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ సలహాదారులు మీడియాతో రాజకీయపరమైన అంశాలను మాట్లాడటం చూశారా? అని గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సీవీ. మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. అప్పట్లో అలా జరగలేదని సీనియర్‌ న్యాయవాది సమాధానం ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాంపత్య హక్కుల పునరుద్ధరణ వివాదంపై సుప్రీం సూచనలు