Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ఎయిరిండియా రిక్రూట్మెంట్ డ్రైవ్... క్యూకట్టిన

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (12:40 IST)
ముంబైలో ఎయిరిండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కేవలం 2216 ఉద్యోగాలకు ఈ డ్రైవ్ నిర్వహించగా నిరుద్యోగులు వేల సంఖ్యలో తరలివచ్చారు. వీరిని చూసిన ఎయిర్ పోర్టు సిబ్బంది ఆశ్చర్యపోయారు. పైగా, వీరిని అదుపుచేయలేక నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో స్వల్ప తొక్కిసలాటి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
2,216 ఖాళీలను భర్తీ చేసేందుకు ముంబై ఎయిర్‌పోర్టులో మంగళవారం ఎయిర్‌ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఈ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు తండోపతండాలుగా తరలివచ్చారు. కౌంటర్ల వద్ద తమ పత్రాలు సమర్పించేందుకు వారంతా ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది. ఆహారం, నీరు అందక పలువురు ఇబ్బంది పడ్డారు. కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. లోడర్ పోస్టుల కోసం ఈ డ్రైవ్ జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 
 
ఆ ఉద్యోగంలో చేరినవారు విమానం నుంచి లగేజీ దించడం, ఎక్కించడంతోపాటు బ్యాగేజీ బెల్టులను చూసుకోవాలి. ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్‌లో లగేజీ, కార్గోను చూసుకునేందుకు ఐదుగురు లోడర్స్ అవసరం ఉంటుంది. వారికి నెలకు రూ.20 వేల నుంచి 25 వేలకు వేతనం అందిస్తారు. ఓవర్‌టైమ్ చేసి చాలామంది రూ.30 వేల వరకు సంపాదిస్తుంటారు. ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హతలు ఉంటే సరిపోతుంది కానీ, అభ్యర్థులు శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. 
 
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కొందరు 400 కి.మీ. ప్రయాణించి రావడం గమనార్హం. వారిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌, డిగ్రీ పూర్తి చేసినవారు కూడా ఉన్నారు. ఉన్నత చదువులు చదివినా ఇప్పటివరకు ఉద్యోగం లభించనివారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం కోసం వచ్చారు. మరికొందరు రాజస్థాన్‌ నుంచి వచ్చినవారు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments