Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిర్ ఇండియా అందించిన భోజనంలో బ్లేడ్!!!

Advertiesment
Blade

వరుణ్

, మంగళవారం, 18 జూన్ 2024 (13:08 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సరఫరా చేసే భోజనంలో బ్లేడ్ కనిపించడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. తమ ప్రయాణికుల కోసం సరఫరా చేసిన ఆహారంలో ఒకరికి బ్లేడ్, మరొకరికి ఉడకని ఆహారం వచ్చింది. ఈ రెండు సంఘటనలు బెంగళూరు నుంచి, న్యూఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లిన విమానాల్లో చోటుచేసుకున్నాయి. 
 
గత వారం బెంగళూరు నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియాకు చెందిన ఏఐ 175 విమానంలో ప్రయాణించిన మధు రేస్ పాల్ అనే జర్నలిస్టుకు విమాన సిబ్బంది భోజనాన్ని అందించారు. తింటుండగా నోట్లో ఏదో గట్టిగా తగిలినట్టు అనిపించింది. బయటకు తీసి చూడగా అది బ్లేడ్ ముక్క. ఆ ఫొటోను ఆయన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా స్పందించింది. అది కూరగాయలు కట్ చేసే వి మిషన్‌ని బ్లేడ్ ముక్క అని క్షమాపణలు చెప్పింది. 
 
ఆ తర్వాత పాల్‌ను సంప్రదించి.. ఏడాదికాలంపాటు ఎయిరిండియా విమానంలోనైనా చెల్లుబాటయ్యేలా బిజినెస్ క్లాస్ టికెట్‌ను ఆఫర్ చేసింది. అయితే 'లంచం'గా పేర్కొంటూ పాల్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలిసింది. ఈ ఘటన మరిచిపోకముందే మరో ఘటనలో రూ.5 లక్షలు వెచ్చించి ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్ కొంటే తనకు ఉడకని ఆహారం వడ్డించారని, సీట్లు కూడా చాలా మురికిగా ఉన్నాయని వినీత్ అనే వ్యక్తి ఆరోపించారు. ఆయన శుక్రవారం న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌ ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించగా ఈ చేదు అనుభవం ఎదురైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీడియా Live ఇస్తుందా? తాడేపల్లిలో ఏమి పని నీకు ? పులివెందుల ప్రజలకు సేవ చేయమ్మా