కె-12 విభాగంలో ప్రవేశించిన నూతన స్టార్టప్‌ ఐ-టెక్‌

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (17:16 IST)
భారతదేశంలో ఆన్‌లైన్‌ విద్యా విభాగపు విలువ దాదాపు 2 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. విద్యార్థుల నడుమ 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు లక్ష్యంగా చేసుకున్నది నూతన విద్యా విధానం 2020. అయితే బోధించే నైపుణ్యాలకు, నేర్చుకునే అంశాలకు నడుమ భారీ ఖాళీ ఉంది. ఈ ఖాళీని పూరించాలంటే విద్యార్థులకు చిన్నతనం నుంచే సంబంధిత శిక్షణను అందించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యంతోనే ఐయాంట్‌, 6-12వ తరగతి (సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ విభాగాలు) విద్యార్థుల కోసం నూరు శాతం ఐటీ నైపుణ్య శిక్షణా వేదికగా ఐ-టెక్‌ను ఆవిష్కరించింది.
 
కోడింగ్‌, ఐటీ ఫండమెంటల్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్స్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌, పైథాన్‌ మొదలైన సాంకేతిక నైపుణ్య అంశాలతో పాటుగా అభిజ్ఞా అభ్యాసమైనటువంటి మైండ్‌ మ్యాపింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ తదితర అంశాలను ఐ-టెక్‌ కోర్సు మిళితం చేసుకుంది. విద్యార్థుల విద్యలో నూతన కోణాన్ని ఇది జోడించనుంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈతో పాటుగా రాష్ట్ర బోర్డుల విద్యార్థులు ఈ కోర్సులను ఎంచుకోవచ్చు.
 
‘‘ఈ కోర్సు కంటెంట్‌ పలు నైపుణ్యాలు, విజ్ఞాన అంశాల సమాహారం. భావి అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని తీర్చిదిద్దాము. విజయవంతమైన కెరీర్‌లను పొందడానికి ఈ నైపుణ్యాలను సంతరించుకోవడం అత్యంత కీలకం’’ అని భక్తి ఓజ్మా ఖేర్నానీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఐయాంట్‌ అన్నారు.
 
ఈ ఐ-టెక్‌ కోర్సులను నాలుగు విభాగాలుగా విభజించారు. ఆరు-ఏడు తరగతుల కోసం జూనియర్‌; 8-9 తరగతులకు సీనియర్‌; 10-12 తరగతులకు ఐటెక్‌ ఎక్స్‌పర్ట్‌ మరియు 12వ తరగతి పైన వారికి ఐటెక్‌ సుప్రీమ్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తిగా ఆన్‌లైన్‌లో బోధిస్తారు. బ్యాచ్‌లు పరిమితంగా ఉంటాయి. విద్యార్థులకు సౌకర్యవంతమైన భాషలో బోధన చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments