భారతదేశపు అగ్రశ్రేణి ఆన్‌లైన్ అభ్యాస సంస్థ హరప్పా ఎడ్యుకేషన్, తమ రెండవ దశ డిజిటల్ కార్యక్రమం హ్యాబిట్ హీరోస్‌ను ఉపాధ్యాయ దినోత్సవం వేడుక చేస్తూ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమం ద్వారా, హరప్పా ఆన్‌లైన్ విద్యకు మార్గదర్శకత్వం వహించే అధ్యాపకులను గుర్తించి గౌరవిస్తుంది. ఈ అధ్యాపకులు మార్పును స్వీకరించడంతో పాటుగా ఆన్‌లైన్ బోధనను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
మహమ్మారి కారణంగా పాఠశాలలు మరియు కళాశాలలు కొన్ని అంశాలలో దెబ్బతిన్నాయి. గత కొద్ది నెలలుగా, ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం చేత కోట్లాది మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు నూతన అభ్యాస ప్రక్రియలను స్వీకరిస్తున్నారు. ప్రపంచమంతా నూతన సాధారణతను స్వీకరిస్తున్న వేళ, అధికశాతం మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ విద్య అనేది నూతన సాధారణతగా కొనసాగుతుంది.
మొదటి దశ హ్యాబిట్ హీరోస్‌లో హరప్పా, భారతదేశ వ్యాప్తంగా మార్చి నుంచి మే నెల వరకూ జరిగిన లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని 10 మంది హ్యాబిట్ హీరోలను వారి ధైర్యం, సహకారం మరియు పౌర స్పృహ కార్యక్రమాల కారణంగా గుర్తించింది. తొలి ఎడిషన్ సాధించిన విజయాన్ని అనుసరించి, రెండవ దశలో తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేయడంతో పాటుగా మద్దతునందించడంలో నూతన మార్గాన్ని అనుసరించడంలో ఎదురైన సవాళ్లను అధిగమించడానికి నూతన అభ్యాసాన్ని చేసిన ఉపాధ్యాయులను గుర్తిస్తుంది.
వీడియో దరఖాస్తు ప్రక్రియ ద్వారా ఐదుగురు స్ఫూర్తిదాయక హ్యాబిట్ హీరోలను హరప్పా ఎంపిక చేయనుంది. ఈ విజేతలు ఉత్సాహపూరితమైన బహుమతులు మరియు ప్రయోజనాలను పొందనున్నారు.
గుర్తింపు మరియు దృశ్యమాన్యత- ప్రపంచంతో విజేతల యొక్క స్ఫూర్తిదాయక కథను పంచుకునేందుకు ప్రత్యేక వీడియో మరియు బ్లాగ్ ఏర్పాటు.
జీవితకాలపు అభ్యాసం- అన్ని హరప్పా కోర్సులనూ కాంప్లిమెంటరీగా పొందే అవకాశం.
స్నేహితులు మరియు కుటుంబసభ్యుల బహుమతులు- విజేతల స్నేహితులు మరియు కుటుంబసభ్యులకు 20 ప్రోమో కోడ్స్. దీనిద్వారా 20% రాయితీతో వారు హరప్పా కోర్సులను కొనుగోలు చేయవచ్చు.
శ్రేయాసీ సింగ్, ఫౌండర్ అండ్ సీఈవో, హరప్పా ఎడ్యుకేషన్ మాట్లాడుతూ, ‘‘హరప్పా వద్ద, మా నిష్ణాతులైన ఫ్యాకల్టీ, పలు పాఠశాలలు మరియు కాలేజీలకు చెందిన ఉపాధ్యాయులకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వీరంతా కూడా విద్యార్థులు అభ్యసించేందుకు సహాయపడటంతో పాటుగా వారు ఎదిగేందుకు, తమ సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతున్నారు. ఈ ఉపాధ్యాయుల దినోత్సవ వేళ మరింత ప్రత్యేకం.
ఎంతమంది ఉపాధ్యాయులు దీనిని స్వీకరిస్తున్నారనేది చూడడం జరుగుతుంది. మార్పును స్వీకరించడానికి మరియు దానిని ఆకలింపు చేసుకోవడానికి వారు చూపిన ఆసక్తి మమ్మల్ని ఆకట్టుకోవడమే కాదు మాకు మరింత బాధ్యతనూ తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా, నేడు మరియు ఎల్లప్పుడూ మన జీవితాలకు తోడ్పాటునందిస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాము’’ అని అన్నారు.
ఆన్‌లైన్ పట్ల అమితాసక్తిని ప్రదర్శించే ఉపాధ్యాయులను గురించి మీకు తెలిసినా లేదా ఈ కష్టకాలంలో తమ విద్యార్థులకు మద్దతునందించడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు మీరు ధన్యవాదములు తెలుపాలనుకున్నా నామినేషన్లు ఆదివారం, సెప్టెంబర్ 20, 2020వ తేదీ వరకూ తెరిచి ఉన్నాయి. దరఖాస్తు చేసేందుకు హరప్పా ఎడ్యుకేషన్ వెబ్ సైట్ చూడవచ్చు.