ఎస్.బి.ఐ నుంచి ఎం-క్యాష్ సేవలు నిలిపివేత

ఠాగూర్
శనివారం, 15 నవంబరు 2025 (16:30 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా గుర్తింపు పొందిన భారతీయ స్టేట్ బ్యాంకు ఈ నెల 30వ తేదీ నుంచి ఎం-క్యాష్ సేవలను పూర్తిగా నిలిపివేయనుంది. ఈ విషయాన్ని ఆ బ్యాంకు తాజాగా ప్రకటించింది. నగదు లావాలేదీలకు సురక్షితమైన విధానాలను ఎంచుకోవాలని తమ ఖాతాదారులకు సూచనచేసింది. 
 
ప్రస్తుతం ఎస్.బి.ఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్‌లలో ఈ ఎం-క్యాష్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిద్వారా కస్టమర్లు లబ్దిదారుడి బ్యాంకు ఖాతాను ముందుగా నమోదు చేయకుండానే కేవలం వారి మొబైల్ నంబరు లేదా ఈ-మెయిల్ ఐడీ ఉపయోగించి డబ్బు పంపడం, స్వీకరించడం చేయొచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని ఈ నెల 30వ తేదీ నుంచి తొలగిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. 
 
ఎం-క్యాష్ సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో కస్టమర్లు నగదు బదిలీ కోసం ఇతర సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ఉపయోగించుకోవాలని ఎస్.బి.ఐ సూచించింది. ఇందుకో ప్రత్యామ్నాయ మార్గాలైన యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి వాటిని ఉపయోగించుకోవాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments