Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

venkateswara swamy

ఠాగూర్

, మంగళవారం, 17 డిశెంబరు 2024 (09:50 IST)
వచ్చే యేడాది మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు బుధవారం విడుద చేయనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వివిధ రకాలైన అర్జిత సేవా టికెట్లు, దర్శనాల టిక్కెట్లను విడుదల చేయనున్నారు. 
 
శ్రీవారి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల టికెట్లను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించి లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
 
ఇక, శ్రీవారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజున (డిసెంబరు 21) వర్చువల్ సేవా టికెట్లను కూడా విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, ఆయా సేవల ద్వారా లభించే దర్శన స్లాట్ల టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
 
డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. అదే రోజు (డిసెంబరు 23) ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అంతేకాదు, డిసెంబరు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం టికెట్లను విడుదల చేయనున్నారు.
 
డిసెంబరు 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు డిసెంబరు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందవచ్చని టీటీడీ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి