Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Advertiesment
Weekly Horoscope

రామన్

, శనివారం, 14 డిశెంబరు 2024 (20:13 IST)
Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. కొత్త పనులు చేపడతారు. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ధృఢసంకల్పంతో ముందుకు సాగండి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. పట్టుదలకు పోవద్దు. బుధవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అదుపులో ఉండవు. సోమవారం నాడు ధన సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానం దూకుడు అదుపుచేయండి. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధన వ్యయంలో జాగ్రత్త వహించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపరాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. మాటతీరు ఆకట్టుకుంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆదివారం నాడు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. ఆత్మీయులతో సంభాషణ కార్యోన్ముఖులను చేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదోన్నతి సూచనలున్నాయి. పురస్కారాలు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త పనులు చేపడతారు. గుట్టుగా వ్యవహరించండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు వస్త్ర ఊపందుకుంటాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం అన్ని విధాలు అనుకూలమే. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆర్థికపరంగా మంచి ఫలితాలున్నాయి. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. సంస్థలు స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారించండి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. కొత్త పరిచయాలేర్పడతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంస్థల స్థాపనలకు అనుమతులు లభిస్తాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో తరచూ సంభాషిస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రలోభాలకు గురికావద్దు, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పాత పరిచయస్తులకు కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు.. అంకితభావం ప్రధానం. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో మెలగండి. మీ కృషి ఫలిస్తుంది. వ్యవహారక్షతతో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త గృహంలో సంతోషాన్ని నింపుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వివాదాలు సరిష్కారమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. సంకల్పబలతో అనుకున్నది సాధిస్తారు. యత్నాలు విరమించుకోవద్దు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. సోమ, మంగళవారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒత్తిళ్లు, ఆగ్రహావేశాలకు గురికావద్దు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మరింత ఏకాగ్రతతో పనిచేయాలి. కీలక చర్చల్లో ప్రముఖంగా పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పసిద్ధికి ఏకాగ్రత ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యులు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. విమర్శించిన వారే తమ తప్పును తెలుసుకుంటారు. బుధవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నోటీసులు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు విపరీతం. రుణ సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతోనే అనుకున్నది సాధిస్తారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గురువారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి మీపై శకునాల ప్రభావం అధికం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్దేశిత ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఆత్మీయులతో తరుచు సంభాషిస్తారు. ఒక సమాచారం కుటుంబంలో ఉత్సాహం కలిగిస్తుంది. శనివారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు