Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

01-12-2024 నుంచి 07-12-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly astrology

రామన్

, శనివారం, 30 నవంబరు 2024 (14:14 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. సలహాలు, సాయం ఆశించవద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. సోమవారం నాడు నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. సంతానం దూకుడు ఇబ్బంది. కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం రుణసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. అధికారులకు హోదామార్పు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కీలక విషయాల్లో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మొండిబాకీలు వసూలవుతాయి. గృహావసరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. శుక్రవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వొద్దు. మీ శ్రీమతి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. భాగస్వామికంగా కంటే సొంత వ్యాపారాలే అనుకూలం. వ్యాపారాలు ఊరందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. పనుల్లో చికాకులు, జాప్యం అధికం. శనివారం నాడు ప్రముఖుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వస్త్రవ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ముక్కుసూటిగా పోయే మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సానుకూలమవుతుంది. గృహమార్పు అనివార్యం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. సమర్ధతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. న్యాయ, వైద్య, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీకు సర్వత్రా ప్రోత్సాహకరం. వ్యవహారానుకూలత, ధనప్రాప్తి ఉన్నాయి. మీ చిత్తశుద్ధికి ప్రశంసలందుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఆందోళన కలిగించిన సమస్య నిదానంగా సర్దుకుంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. మార్కెటింగ్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు కొంతమేరకు చక్కబడతాయి. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపునకు అవకాశం లేదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. బుధ, గురువారాల్లో అందరితో మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలకు కొంతమంది వక్రీకరిస్తారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. ఉన్నతాధికారులకు కష్టసమయం. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. వాహనం ఏకాగ్రతతో నడపండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఏకాగ్రతతో కార్యసాధనకు శ్రమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రలోభాలకు లొంగవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఎదుటివారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. తరుచు ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ఆది, సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అవివాహితులకు శుభయోగం. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-12-2024 నుంచి 31-12-2024 వరకు మీ మాస ఫలితాలు