Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్మో... డిసెంబరులో బ్యాంకులకు అన్ని సెలవులా?

bank holiday

ఠాగూర్

, గురువారం, 28 నవంబరు 2024 (13:23 IST)
ఈ యేడాది ఆఖరు నెల డిసెంబరులో బ్యాంకులకు రెండు అంకెల్లో సెలవులు రానున్నాయి. నిజానికి ఎలాంటి పండగలు, పబ్బాలు లేకపోయినప్పటికీ బ్యాంకులకు మాత్రం ఏకంగా 17 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. భారత రిజర్వు బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం డిసెంబరు నెలలో 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు బ్యాంకుకు సంబంధించిన  ఏదైనా ముఖ్యమడత పని ఉంటే సకాలంలో పూర్తి చేసుకోవాలని బ్యాంకు అధికారులు సలహా  ఇస్తున్నారు. ఈ సెలవులు ఏకరీతిన లేనప్పటికీ అవి వివిధ రకాలుగా నిర్ణయించారు. డిసెంబరు నెలలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలుపుకుని మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడం విశేషం. అయితే, ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. 
 
డిసెంబరు 2024లో వచ్చే బ్యాంకు సెలవులను పరిశీలిస్తే, 
 
డిసెంబర్ 1న ఆదివారం - (ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం) దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 3న మంగళవారం - (సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డే) గోవాలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 8న ఆదివారం - వారాంతపు సెలవు
డిసెంబర్ 10న మంగళవారం - (మానవ హక్కుల దినోత్సవం) దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 11న బుధవారం - (యునిసెఫ్ పుట్టినరోజు) అన్ని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 14న శనివారం - అన్ని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 15న ఆదివారం - వారపు సెలవు
డిసెంబర్ 18న బుధవారం - (గురు ఘాసిదాస్ జయంతి) చండీగఢ్‌లో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 19న గురువారం - (గోవా విమోచన దినోత్సవం) గోవాలో బ్యాంకులు బంద్
డిసెంబర్ 22న ఆదివారం - వారపు సెలవు
డిసెంబర్ 24న మంగళవారం - (గురు తేగ్ బహదూర్ బలిదానం రోజు, క్రిస్మస్ ఈవ్) మిజోరం, మేఘాలయ, పంజాబ్, చండీగఢ్‌లలో బ్యాంకులు బంద్
డిసెంబర్ 25న బుధవారం - (క్రిస్మస్) అన్ని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 26న గురువారం - (బాక్సింగ్ డే, క్వాంజా) అన్ని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 28న శనివారం - నాలుగో శనివారం, అన్ని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 29న ఆదివారం - వారపు సెలవు
డిసెంబర్ 30న సోమవారం - (తము లోసార్ సందర్భంగా) సిక్కింలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 31న మంగళవారం – (నూతన సంవత్సర వేడుక) మిజోరంలో బ్యాంకులు బంద్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు జడ్జీలకు చేదు అనుభవం... విమానంలో మందుబాబుల వీరంగం