Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో దాస్ వెల్ట్ఆటో ఎక్స్‌లెన్స్ కేంద్రం: ప్రీ ఓన్డ్ కార్స్ విభాగంలో వోక్స్‌వ్యాగన్ ఇండియా

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (22:54 IST)
వోక్స్‌ వ్యాగన్‌ ప్యాసెంజర్‌ కార్స్‌ ఇండియా నేడు తమ డిజిటల్‌గా సమగ్రపరిచిన సర్వీస్‌ ఔట్‌లెట్‌- దాస్‌ వెల్ట్‌ ఆటో ఎక్స్‌లెన్స్‌ సెంటర్స్‌ను ప్రీ ఓన్డ్‌ కార్ల కోసం హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా, ఈ బ్రాండ్‌ తమ ఏకీకృత పరిష్కారాలను కొనుగోలు, అమ్మకం మరియు మార్పిడిని ధృవీకృత ప్రీఓన్డ్‌ కార్లకు అందించడంతో పాటుగా వినూత్నమైన వాణిజ్య మరియు కస్టమైజ్డ్‌ సేవలను సైతం అందించనుంది. వినియోగదారులు విస్తృత శ్రేణి ఫీచర్లను పొందగలరు. వీటిలో ప్రొఫెషనల్‌ కారు ఇవాల్యుయేషన్‌, ప్రత్యేక ఋణ ఆఫర్లు, వినూత్నమైన యాక్ససరీ ప్యాకేజీలు మరియు క్లిష్టత లేని బదిలీ వంటివి సైతం ఉంటాయి.
 
సున్నితమైన, పారదర్శక మరియు సురక్షిత అనుభవాల కోసం ఈ డీడబ్ల్యుఏ సదుపాయాలు కొనుగోలు, విక్రయం లేదా మార్పిడి సదుపాయాలను మల్టీ బ్రాండ్‌ ప్రీ ఓన్డ్‌ కార్లకు అందిస్తాయి. సమగ్రమైన వ్యాపార సమర్పణ మరియు సరసమైన ధరలలో ఉపయోగించిన కార్లను అందిస్తామనే వాగ్ధానంతో పాటుగా పూర్తిగా పరీక్షించిన మరియు ధృవీకృతం కావడంతో పాటుగా అసలైన విడిభాగాలు, సేవలు, వారెంటీ ప్యాకేజీలు (12 నెలల వరకూ), భీమా మరియు ఆర్థిక మద్దతును సంభావ్య వినియోగదారులకు అందించనుంది.
 
ప్రతి ప్రీ ఓన్డ్‌ వాహనమూ పూర్తి స్ధాయిలో తనిఖీ చేయబడుతుంది. దాదాపు 160 అంశాలను తనిఖీ చేయడంతో పాటుగా అత్యంత కఠినమైన ప్రక్రియలు మరియు థర్డ్‌ పార్టీ ఇన్‌స్పెక్టర్‌  పరీక్షలు పూర్తయిన తరువాత సర్టిఫికేషన్‌ అందిస్తారు. భారతదేశ వ్యాప్తంగా 105కు పైగా ఔట్‌లెట్లకు చేరుకోవడం ద్వారా డీడబ్ల్యుఏ, ఏకీకృత పరిష్కారంగా  బలీయమైన విలువ ప్రతిపాదనను వ్యవస్థీకృత ప్రీ ఓన్డ్‌ విభాగంలో అందిస్తుంది. ఇది వినియోగదారులు అందుబాటు ధరలలో వ్యక్తిగత రవాణా అవసరాలను పొందగలిగేందుకు తోడ్పడుతుంది.
 
ఈ బ్రాండ్‌ ఇప్పుడు డిజిటైజేషన్‌ను డీడబ్ల్యుఏ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాల వద్ద అందిస్తూ క్లిష్టత లేని మరియు కాంటాక్ట్‌లెస్‌ అనుభవాలను అందిస్తుంది. సంభావ్య వినియోగదారులు పూర్తిస్ధాయిలో డిజిటల్‌ అనుభవాలలో లీనం కావొచ్చు. వీటిలో సమగ్రమైన ఆన్‌లైన్‌ కొనుగోలు లేదా విక్రయాలను డీడబ్ల్యుఏ వెబ్‌సైట్‌ పై పొందడం నుంచి దాస్‌ వెల్ట్‌ ఆటో వాల్యుయేటర్‌ యాప్‌ ద్వారా స్వీయ వాల్యుయేషన్‌ను సైతం చేయవచ్చు. ఈ వినూత్నమైన మొబైల్‌ అప్లికేషన్‌ వేగవంతమైన మరియు పారదర్శక వాల్యుయేషన్లను ఇండియన్‌ బ్లూ బుక్‌ అందించిన అల్గారిథమ్స్‌కు అనుగుణంగా అందిస్తుంది.
 
వోక్స్‌వ్యాగన్‌ ఇప్పుడు డిజిటల్‌గా సులభమైన, ప్రొఫెషనల్‌గా నిర్వహించతగిన, నగదుకు తగ్గ విలువ ప్రతిపాదనను వ్యక్తిగత రవాణా అవకాశాల కోసం వెదికే వినియోగదారులకు అందిస్తుంది. దీనికనుగుణంగానే, వోక్స్‌వ్యాగన్‌ ఇప్పుడు 17 డీడబ్ల్యుఏ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను 2021 నాటికి ఏర్పాటుచేయనుంది. వీటికి అత్యంత కఠినమైన అంతర్గత మార్గదర్శకాలకనుగుణంగా ఏర్పాటుచేయనున్నారు. వీటితో పాటుగా, ఈ బ్రాండ్‌ ఇప్పుడు వెరిఫికేషన్లతో పాటుగా అంతర్గత ఆడిట్స్‌ నిర్వహించడం ద్వారా డీడబ్ల్యుఏ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు సున్నితంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందనే భరోసా అందిస్తుంది.
 
ఈ కార్యక్రమం గురించి శ్రీ స్టెఫెన్‌ నాప్‌, డైరెక్టర్‌, వోక్స్‌వ్యాగన్‌ పాసెంజర్‌ కార్స్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘వినియోగదారుల అనుభవాలనేవి మా బ్రాండ్‌ సిద్ధాంతంలో అత్యంత కీలకమైవి. ఇప్పుడు డీడబ్ల్యుఏ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను పరిచయం చేయడం ద్వారా మేము వృద్ధి చెందుతున్న ప్రీ –ఓన్డ్‌ కార్‌ విభాగ అవసరాలను తీర్చగలము. కస్టమైజ్డ్‌ సేవలను అందించాలన్నది మా లక్ష్యం. ప్రీ ఓన్డ్‌ కార్ల వినియోగదారులకు కొనుగోలు, విక్రయం లేదా మార్పిడి ప్రక్రియలో పూర్తి మనశ్శాంతిని అందించడంతో పాటుగా ఈ ప్రక్రియను క్లిష్టత లేని రీతిలో అందించనున్నాం’’ అని అన్నారు.
 
శ్రీ నిహార్ మోదీ, మేనేజింగ్ డైరెక్టర్, వోక్స్‌వ్యాగన్ దక్కన్ (హిమాయత్ నగర్) మాట్లాడుతూ, "వోక్స్‌వ్యాగన్‌తో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా డీడబ్ల్యుఏ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను పరిచయం చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ప్రీ ఓన్డ్ కార్ విభాగంలో అనుకూలమైన మరియు పారదర్శక విధానాల ద్వారా వ్యక్తిగత రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు మేము లక్ష్యంగా చేసుకున్నాము. డీడబ్ల్యుఏ ఎక్స్‌లెన్స్ కేంద్రాల ద్వారా, మేము డిజిటల్‌గా అనుసంధానితమైన, కస్టమైజ్డ్ సేవలను ప్రీ ఓన్డ్ కార్ల కొనుగోలు, అమ్మకం మరియు మార్పిడిని ఒకే గొడుగు కింద ఎలాంటి క్లిష్టత లేని రీతిలో, మెరుగైన వినియోగదారుల అనుభవాలను అందించనున్నాం'' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments