Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కడి రాజీనామా... ఒక్క రోజులో 'ఇన్ఫోసిస్'కు రూ.22,000 కోట్లు నష్టం... ఏంటిది?

ఇన్ఫోసిస్ అనగానే ఐటీ రంగంలో దిగ్గజ సంస్థగా చెప్పుకుంటాం. కానీ శుక్రవారం ఆ కంపెనీకి చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాఖ్ సిక్కా తన పదవికి రాజీనామా చేయడంతో కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు రూ.22,000 వేల కోట్ల మేర నష్టపోయినట్లు వార్తలు వస్తున

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (18:58 IST)
ఇన్ఫోసిస్ అనగానే ఐటీ రంగంలో దిగ్గజ సంస్థగా చెప్పుకుంటాం. కానీ శుక్రవారం ఆ కంపెనీకి చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాఖ్ సిక్కా తన పదవికి రాజీనామా చేయడంతో కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు రూ.22,000 వేల కోట్ల మేర నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కడి రాజీనామాతో అదీ ఒక్కరోజులో కంపెనీకి ఇంత భారీగా నష్టాలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే సిక్కా తను రాజీనామా చేస్తూ సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తిపై విమర్శలు, ఆరోపణలు చేసారు. దీనిపై మూర్తి చాలా ఆవేదన చెందినట్లు సమాచారం.
 
మరోవైపు ఐటీ రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులతో ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సిక్కా రాజీనామాతో ఇన్ఫోసిస్ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్ సంస్థ వినియోగదారులు, ఉద్యోగులు, యాజమాన్యం మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతోనే సిక్కా రాజీనామా చేయాల్సి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన రాజీనామా కంపెనీకి పెద్ద కుదుపు. కాగా ఆయన స్థానంలో వెంటనే మరొకర్ని సంస్థ నియమించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments