Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా ఎవరో నాకు తెలియదు.. భూమా ఫ్యామిలీతో చిరు-పవన్‌లకు సంబంధాలున్నాయ్: వేణు మాధవ్

సినీ హాస్య నటుడు వేణు మాధవ్ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో దిగారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ప్రచారం చేశారు. సినీ అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వేణు మాధవ్‌ను తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికల ప

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (17:01 IST)
సినీ హాస్య నటుడు వేణు మాధవ్ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో దిగారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ప్రచారం చేశారు. సినీ అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వేణు మాధవ్‌ను తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో దించితే ఆయనకు పాపులారిటీ వస్తుందని ఆశించినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ ఆశించినట్లే వేణు మాధవ్ ఎన్నికల ప్రచారం పార్టీకి కాస్త బూస్టునిచ్చింది. 
 
వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటి రోజాకు కౌంటరిచ్చేందుకు వేణు మాధవ్ రంగంలోకి దిగారని టాక్ వస్తోంది. మొన్నటికి మొన్న ఎన్నికల ప్రచారంలో తన బిడ్డకు సమానమైన భూమా అఖిలప్రియపై కామెంట్ చేసిన ఆమె (రోజా) ఎవరు? ఆమె ఏం చేస్తుందటి? అంటూ సెటైర్లు విసిరిన వేణు మాధవ్.. మళ్లీ రోజాను తేలిగ్గా తీసిపారేశారు. రోజా ఎవరో తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. 
 
చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని.. డ్యాన్సులు చేసే రోజానా అఖిల ప్రియ గురించి మాట్లాడేది అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయిన వేణు మాధవ్.. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... రోజాకు కౌంటర్ ఇచ్చేందుకే మిమ్మల్ని టీడీపీ అధిష్ఠానం రంగంలో దింపిందనే కామెంట్స్ వస్తున్నాయి? అని ప్రశ్నించగా.. ఆమె ఎవరో నాకు తెలియదు.. సారీ అంటూ బదులిచ్చారు. 
 
తాను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మహానటుడు ఎన్టీఆర్ వద్ద, టీడీపీ ఆఫీసులో పనిచేసేవాడిని. కాబట్టి, టీడీపీతో, నందమూరి కుటుంబంతో తనకు అనుబంధం వుందని చెప్పారు. ఆ అనుబంధం కారణంగానే నంద్యాల ఎన్నికల ప్రచారంలో దిగానని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments