Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా మార్చుకోవచ్చు.. ఎలా?

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (13:40 IST)
ప్రస్తుతం టెలికాం రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా, 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టెలికాం సేవలు సామాన్యుడికి సైతం మరింత దగ్గరయ్యాయి. అలాగే, వాడుతున్న మొబైల్ నంబరును మార్చుకోకుండానే మరో సర్వీస్ ప్రొవైడర్‌కు మారే వెసులుబాటు ఉంది. అలాగే, ఇపుడు డీటీహెచ్, కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లు కూడా తమకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు రానుంది. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్యలు చేపట్టింది. 
 
ఇకపై కేబుల్‌ టీవీ, డీటీహెచ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు తమ వినియోగదారులకు అందజేసే సెట్‌టాప్‌ బాక్సులు తప్పనిసరిగా ఇంటరాపరబిలిటీ సపోర్ట్‌ను కలిగి ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సెట్‌టాప్‌ బాక్సుల్లో ఇంటరాపరబిలిటీ సపోర్ట్‌ను తప్పనిసరి చేసేందుకు అవసరమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని ట్రాయ్‌ శనివారం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేసింది. 
 
వినియోగదారులు కొత్త సెట్‌టాప్‌ బాక్సును కొనుగోలు చేయకుండానే తమ సర్వీస్‌ ప్రొవైడర్‌ను మార్చుకొనేందుకు ఇంటరాపరబుల్‌ సెట్‌టాప్‌ బాక్సులు వీలుకల్పిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని డీటీహెచ్‌, కేబుల్‌ టీవీ నెట్‌వర్కులు తమ వినియోగదారులకు నాన్‌-ఇంటరాపరబుల్‌ సెట్‌టాప్‌ బాక్సులను అందజేస్తున్నాయి. 
 
ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారేందుకు నాన్‌-ఇంటరాపరబుల్‌ సెట్‌టాప్‌ బాక్సులు ఉపయోగపడవు. దీంతో వినియోగదారులు సర్వీస్‌ ప్రొవైడర్‌ను మార్చుకోవాలంటే కొత్త సెట్‌టాప్‌ బాక్సును కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా వినియోగదారుడిపై అదనపుభారం పడుతోంది. దీన్ని తగ్గించేందుకు ట్రాయ్ చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం