Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్.. స్మార్ట్ కార్డుల జారీలో జాప్యం

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (11:56 IST)
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే స్మార్ట్ కార్డుల జారీలో జాప్యం ఏర్పడుతోంది. ఫలితంగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వాహనదారులకు ఇబ్బందులు తప్పట్లేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో రోజుకు 300 స్మార్ట్ కార్డులను ప్రింట్ చేసి.. వాహనదారులకు పంపడం జరుగుతుంది. ఈ కార్డులను స్పీడ్ పోస్టుల ద్వారా పంపిస్తారు. 
 
దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల తర్వాతే.. ఈ కార్డులు వాహన దారుల చేతికి అందుతోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ నెలల పాటు జరుగుతోంది. వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే స్మార్ట్ కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డులు వాహనదారులు అందుకునేందుకు నెల సమయం పడుతోంది. ఈ రిజిస్ట్రేషన్ అయినా స్మార్ట్ కార్డుల కోసం తాము చెల్లింపులు చేసినా ఎందుకు జాప్యం అవుతుందో అర్థం కావట్లేదని ఓ వాహనదారుడు వాపోయాడు.
 
అయితే కొందరు బ్రోకర్లు ఆర్టీఏ ఆఫీసు బయట నిల్చుని ఒక రోజులోనే స్మార్ట్ కార్డు ఇప్పిస్తామని.. అందుకు కాస్త డబ్బు చెల్లించాల్సి వుంటుందని చెప్తున్నారు. ఇలా బ్రోకర్లు బాగానే వాహనదారుల వద్ద డబ్బు గుంజేస్తున్నారని.. ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. 
 
ఇలాంటి ఆరోపణలపై ఆర్టీఏ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ (ఐటీ) సి. రమేష్ మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వాహనదారులను ఈ స్మార్ట్ కార్డులను మొబైల్ అప్లికేషన్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments