Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా రోడ్ వేస్ నుంచి 1000 బస్సులకు ప్రతిష్టాత్మక ఆర్డర్ పొందిన టాటా మోటార్స్

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (23:18 IST)
హర్యానా రోడ్ వేస్ నుంచి 1000 బస్సులకు ప్రతిష్టాత్మక ఆర్డర్ పొందినట్లుగా భారతదేశ అతి పెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్ నేడిక్కడ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం టాటా మోటార్స్ దశల వారీగా 52- సీట్ల ఫుల్లీ బిల్ట్ బిఎస్6 డీజిల్ బస్సులను సరఫరా చేయనుంది. టాటా మోటార్స్ బస్సులు అత్యున్నత స్థాయి ప్రయాణ సౌఖ్యాన్ని, అధిక ఇంధన సామర్థ్యాన్ని, విశ్వసనీయతను, తక్కువ యాజమాన్య వ్యయాలను అందిస్తాయి. ప్రభుత్వ టెండర్ ప్రక్రియ ద్వారా ఇ-బిడ్డింగ్ ప్రక్రియ జరిగింది.
 
ఈ సందర్భంగా హర్యానా రవాణా విభాగం ముఖ్య కార్యదర్శి, ఐపీఎస్ అధికారి, నవ్ దీప్ సింగ్ విర్క్ మాట్లాడుతూ, ‘‘టాటా మో టార్స్‌కు 1000 బస్సుల ఆర్డర్ ఇవ్వడం మాకెంతో ఆనందదాయకం. ఆధునిక, ఆదాలను అందించే బిఎస్6 బస్సులు వాటిని ఉపయోగించే వారికి ఎన్నో ప్రయోజనాలను అందించనున్నాయి. ప్రయాణికులకు తిరుగులేని సౌఖ్యాన్ని ఇస్తాయి. నూతన బస్సులను చేర్చుకోవడం అంతర్ రాష్ట్ర ప్రజా రవాణాను మరింత సామర్థ్యపూరితం చేయనుంది, హర్యానా రాష్ట్రమం తటా సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పించనుంది’’ అని అన్నారు.
 
టాటా మోటార్స్ ప్రోడక్ట్ లైన్- బసెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రోహిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘‘హర్యానా రోడ్ వేస్ నుంచి మేం అతి పెద్ద, ప్రతిష్టాత్మక ఆర్డర్ పొందడం మాకెంతో ఆనందదాయకం. ఈ బస్సులను అందించడం హర్యానా రాష్ట్రప్రభుత్వంతో మా భాగ స్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది. రాష్ట్ర ప్రజలకు ఆధునిక ప్రజా రవాణాను అందించడంలో తోడ్పడనుంది. మా బస్సులతో భారత దేశంలో ప్రజా రవాణాను ఆధునికం చేసేందుకు, అత్యుత్తమ సౌఖ్యాన్ని, సామర్థ్యాన్ని అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.
 
టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలు ‘పవర్ ఆఫ్ 6’ తాత్వికతపై డిజైన్ చేయబడి తయారవుతాయి. అవి తిరుగులేని డ్రైవియబిలిటీని, తక్కువ వ్యయాలతో నిర్వహణ, సౌఖ్యం, సౌలభ్యం, కనెక్టివిటీని అందిస్తాయి. టాటా మోటార్స్ తన ఫ్లాగ్ షిప్ ఇన్షియేటివ్ సంపూర్ణ సేవను కూడా అందిస్తోంది. రిపేర్ టైమ్ అస్యూరన్స్, బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ రిపేర్ టైమ్, ఎక్స్ టెండెడ్ వారంటీ, వాహనం నిర్వహణకు సంబంధించి ఇతర యాడ్ ఆన్ సేవలు వంటివి ఇందులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments