Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడలో గృహ ఉత్సవ్‌ను నిర్వహిస్తోన్న పిరామల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, అందుబాటు ధరలలో గృహ ఋణాలు

loan cashback
, శుక్రవారం, 18 నవంబరు 2022 (22:23 IST)
పిరామల్‌ ఫైనాన్స్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలో వినూత్న శైలిలో ప్రోపర్టీ ఎగ్జిబిషన్‌ను ‘గృహ ఉత్సవ్‌’ శీర్షికన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ కంపెనీ అందుబాటు ధరలలో గృహ ఋణాలను ఉద్యోగులు, స్వీయ ఉపాధి కలిగిన వ్యక్తులకు అందజేస్తోంది. పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పిరామల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌), దీనినే పిరామల్‌ ఫైనాన్స్‌గా వ్యవహరిస్తున్నారు.
 
ఈ గృహ ఉత్సవ్‌ను నవంబర్‌ 19, నవంబర్‌ 20, 2022 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి  8 గంటల వరకూ సంయుక్త్‌ వేదిక హాల్‌, స్టెల్లా కాలేజీ వద్ద, బాటా షోరూమ్‌ సర్వీస్‌ రోడ్‌, విజయవాడ 520010 వద్ద నిర్వహించనున్నారు. ఈ కంపెనీ గృహ ఋణాలను 25 బీపీఎస్‌ తగ్గించడంతో పాటుగా ప్రత్యేక లాగిన్‌ ఫీజు 499 రూపాయలతో అందిస్తుంది. ఎగ్జిబిషన్‌ ప్రాంగణం వద్దకు అర్హత కలిగిన వ్యక్తులు అవసరమైన పత్రాలను తీసుకురావడం ద్వారా ఆన్‌ ద స్పాట్‌ అనుమతులను తమ కలల ఇంటి ఋణాల కోసం పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు ప్రత్యేక ఆఫర్లను 40కు ప్రాజెక్టులలో పొందగలరు. వీటిని శివసాయి వాసవి ఆర్కేడ్‌; సాయి మ్యాగ్జిమా హైట్స్‌, హస్నీ ఇన్‌ఫ్రా మిడ్‌ల్యాండ్‌, శ్రీ టౌన్‌షిప్‌, దివిస్‌ ప్యాలెస్‌, ఎస్‌ఎస్‌బీ డెవలపర్స్‌ వంటి 18 మంది డెవలపర్లు అందిస్తున్నారు.
 
ఈ కార్యక్రమం గురించి పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ జైరామ్‌ శ్రీధరన్‌ మాట్లాడుతూ, ‘‘విజయవాడలో గృహ ఉత్సవ్‌ నిర్వహిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. దీని ద్వారా అతి సులభంగా గృహ ఋణాలను అందించాలన్నది మా ప్రయత్నం. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు అత్యంత కీలకమైన మార్కెట్‌లలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. కేవలం రాష్ట్రంలో విస్తరించడం మాత్రమే కాదు, రాబోయే కాలంలో మా వినియోగదారులకు పలు విభిన్నమైన ఉత్పత్తులను సైతం అందించాలని  కోరుకుంటున్నాము. మా వినియోగదారులను చేరుకునేందుకు, ఆన్‌ ద స్పాట్‌ అనుమతులతో వారికి గృహ ఋణాలను అందించేందుకు గృహ ఉత్సవ్‌ అత్యుత్తమ వేదికగా నిలుస్తుంది. అంతేకాదు 40 ప్రాజెక్టులను అతి సులభంగా పొందే అవకాశం కూడా లభిస్తుంది’’ అని అన్నారు.
 
గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, అనంతపూర్‌, అదోనీ, కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, చిత్తూరు, ఏలూరు, చీరాల, భీమవరం, గాజువాక, నర్సారావుపేట వంటి ప్రాంతాలను 21 శాఖలతో ఆంధ్రప్రదేశ్‌లో కవర్‌ చేస్తుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో తమ శాఖల సంఖ్యను రాబోయే మూడు సంవత్సరాలలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే తమ లోన్‌ బుక్‌ను గృహ ఋణాలు, చిన్న వ్యాపార ఋణాలు, ఆటో ఋణాలు వంటి వాటి ద్వారా మరింతగా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పనికిమాలిన దద్దమ్మల్లారా!.. బట్టలిప్పి కొట్టిస్తాను.. చంద్రబాబు వార్నింగ్