Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్‌లో కొత్త ఉత్పత్తులను ఆపండి.. కేంద్రం కీలక నిర్ణయం

Advertiesment
Hero Electric
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (08:26 IST)
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయవద్దని అన్ని ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్‌లను కేంద్ర ప్రభుత్వం కోరింది. 
 
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల రాజధానిలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. బ్యాటరీ స్కూటర్లు అగ్ని ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో దీని ప్రజల తీవ్ర ప్రభావం చూసే సమస్యగా కేంద్రం పరిగణిస్తోంది. 
 
ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారులు ప్రస్తుత మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మోడళ్లను విక్రయించే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే అగ్ని ప్రమాదాలకు కారణాన్ని మరింత పరిశోధించడానికి పలు కంపెనీలు తమ వాహనాలను రీకాల్‌ చేశాయి.
 
సకాలంలో స్కూటర్లను రీకాల్ చేయడంలో విఫలమైతే జరిమానాలు విధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలను హెచ్చరించారు. 
 
ఈ ఆదేశాలకు అనుగుణంగా పలు కంపెనీలు ఈ ఏడాది ఎలాంటి కొత్త మోడల్స్‌ను లాంఛ్ చేసే అవకాశం లేదు. అయితే ఇప్పటివరకు కేవలం మౌఖిక సూచనగా ఉన్న దానికి బ్రాండ్‌లు ఎలా స్పందిస్తాయన్నది తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఎంజీసీలో వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టిన సాజెన్‌