Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షా బంధన్ : ఎస్బీఐ బంపర్ ఆఫర్ - 20 శాతం మేరకు డిస్కౌంట్

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (12:48 IST)
రాఖీ పండుగను పురస్కరించుకుని భారతీయ స్టేట్ బ్యాంకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎస్బీఐ... రక్షా బంధన్ నేపథ్యంలో ఆన్‌లైన్ కోనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
 
ఎస్‌బిఐ విడుదల చేసిన ప్రకటన మేరకు... ఫెర్న్స్ యాంట్ పెటల్స్ కంపెనీ బహుమతి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. అయితే, ఈ ఆఫర్ రూ.999 వరకు బహుమతులపై మాత్రమే వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి, వినియోగదారులు ఎస్బీఐ యోనో యాప్‌ని ఉపయోగించాలి. 
 
ఇకపోతే, బహుమతి కొనుగోళ్లపై 20 శాతం వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందడానికి కస్టమర్లు యోనో యాప్ ద్వారానే చెల్లింపులు జరపాలి. ఈ ఆఫర్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే.. ఎస్బీఐ యోనో, ఎస్బీఐయోనో డాట్ ఎస్బీఐ  అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 
 
ఎస్‌బిఐ ఆఫర్ ఆగస్టు 22 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రాఖీ పండుగ ఆగస్టు 22న ఉంది, ఆ రోజు వరకు 20 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో కనీస కొనుగోలు పరిమితి లేదు. 
 
అయితే, గరిష్ట పరిమితి రూ.999 గా నిర్ణయించబడింది. రూ.999 వరకు మాత్రమే కొనుగోళ్లపై 20 శాతం డిస్కౌంట్ ప్రయోజనం లభిస్తుంది. దీని కోసం ఎస్బీఐ ఒక కోడ్ జారీ చేసింది. ఈ కోడ్ నంబర్ ఎస్‌బిI20 ఇది షాపింగ్ చేసేటప్పుడు అప్లై చేయాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments