Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌ మ్యూజిక్‌ని విపరీతంగా ఇష్టపడుతున్న హైదరాబాద్‌, డేటా విడుదల చేసిన స్పాటిఫై

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (21:05 IST)
మహమ్మారి అందరి జీవితాలను ప్రభావితం చేసింది. సినిమా ఇండస్ట్రీని అయితే చెప్పనవసరం లేదు. మహమ్మారి మూలానా అసలు సినిమాల రిలీజ్‌లే లేవు. దీంతో కొత్త పాటలు కూడా లేవు. కానీ సంగీత ప్రియులకు ఆనందం కావాలన్నా, చిన్నపాటి రిలీజ్‌ కావాలన్నా వారికున్న ఏకైక మార్గం పాటలే. సంగీతం మన మూడ్‌ని మారుస్తుంది.

అందుకే సినిమా పాటలు మనం జీవితంలో అంతర్భాగమైపోయాయి. సినిమా విడుదలలు లేకపోయినా కూడా అభిమానులకు మాత్రం సినిమా పాటలే బాగా ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. స్పాటిఫై ఇండియా వ్యాప్తంగా సేకరించిన డేటాలో ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిశాయి. స్పాటిఫై ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30, 2021 వరకు ఎవరెవరు, ఏఏ పాటలు ఎక్కువుగా ఉంటారు అనే విషయంపై డేటాని సేకరించింది.
 
హైదరాబాద్‌ విషయానికి వస్తే ఇక్కడి సంగీతాభిమానులు రకరకాల సింగర్స్‌పాడిన పాటల్ని ఇష్టపడుతున్నారు. వారిలో టాప్‌ 10 లిస్ట్‌ని ఒకసారి చూస్తే... సిద్‌ శ్రీరామ్‌, అర్జిత్‌ సింగ్‌, అనిరుధ్‌ రవిచందర్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్‌, ప్రీతమ్‌, కేఎస్‌ చిత్ర, అనురాగ్‌ కులకర్ణి, దేవిశ్రీ ప్రసాద్‌ మరియు ఏఆర్‌ రెహమాన్‌ ఉన్నారు. సంగీత ప్రియులు వీరి పాటల్ని ఇష్టపడినప్పుడు.. వారి పాటల్ని స్పాటిఫైలోని హార్ట్‌ సింబల్‌ని ట్యాప్‌ చేయడం ద్వారా లైక్‌ చేయవచ్చు. తద్వారా వారి పాడిన మరిన్ని పాటలు, ఆల్బమ్‌లు, వాటికి సంబంధించిన విషయాలు మీకు తెలుసుకునేందుకు, వినేందుకు అవకాశం ఏర్పడుతుంది.
 
ఇక టాప్‌ 10 టాలీవుడ్‌ సినిమా పాటల విషయానికి వస్తే... చిట్టీ (జాతిరత్నాలు), జల జల జలపాతం నువ్వు (ఉప్పెన), ఒకే ఒక లోకం (శశి), లాహే లాహే (ఆచార్య), తరగతి గది (కలర్‌ ఫోటో), హేయ్‌ ఇది నేనేనా (సోలో బ్రతుకే సో బెటరు), మగువా మగువా (వకీల్‌ సాబ్‌), హోయనా హోయనా (నాని గ్యాంగ్‌లీడర్‌) కాటుక కనులే ( ఆకాశం నీ హద్దురా) మరియు భలేగుంది బాల (శ్రీకారం) ఉన్నాయి. సంగీతాభిమానులు ఈ పాటలు అన్నింటిని ఒక ప్లే లిస్ట్‌లో క్యూలో పెట్టుకుని స్పాటిఫైలో వినవచ్చు.
 
ఈ సందర్భంగా స్పాటిఫై ప్రతినిధి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... టాలీవుడ్ మ్యూజిక్ అందరికి ఎంత ఇష్టమైనదో మాకు తెలుసు. మా స్పాటిఫై డేటా చూసినప్పుడు మాకు ఈ విషయం స్పష్టంగా తెలిసింది. స్పాటిఫై ప్లేలిస్ట్‌ ప్రకారం... టాప్ హిట్స్ తెలుగు, టాలీవుడ్ పెరల్స్‌, లేటెస్ట్ తెలుగు, తెలుగు రొమాన్స్, 90 రొమాన్స్ తెలుగు పాటలు మరియు ఆల్ అవుట్ 00 తెలుగు వంటి పాటలు దశాబ్దాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన పాటలుగా గుర్తింపు పొందాయి. అలాగే తరాలు మారినా కూడా ఆ పాటల్ని ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పడు వాటన్నింటిని స్పాటిఫై ప్లేలిస్ట్‌లో వినవచ్చు. స్పాటిఫై యాప్‌లోని ఆటో-ప్లే మరియు సాంగ్‌ రేడియో ద్వారా సంగీతాభిమానులు తమ ప్లేజాబితా ముగిసిన తర్వాత కూడా వారు ఇష్టపడే ఇలాంటి సంగీతాన్ని తిరిగి వినేందుకు అవకాశం కల్పిస్తోంది.
 
ఆడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయినటువంటి స్పాటిఫై ఈ మధ్యే కొత్త క్యాంపెయిన్‌ని మొదలుపెట్టింది. దిల్‌ ఫిల్మీ తో సునో ఫిల్మీ... అంటే ఎన్నో అద్భుతమైన పాటలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయో ఇది చెప్తుంది. సంగీతం విషయం పక్కనపెడితే... పాడ్‌కాస్ట్‌ ద్వారా ఆడియో స్టోరీ టెల్లింగ్‌ అనే కాన్సెప్ట్‌ తెలంగాణలో బాగా పాపులర్‌ అయ్యింది. 
 
నిజం చెప్పాలంటే... కొన్ని తెలుగు పాడ్‌కాస్ట్‌లో.. తెలుగు ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్స్ట్ అండ్‌ (ఓఎస్‌టీ బీజీఎమ్‌), ఛాయ్‌ బిస్కెట్‌ తెలుగు పాడ్‌కాస్ట్‌, తెలుగు కథలు బై పావని, తెలుగు గీక్స్‌ పాడ్‌కాస్ట్‌ మరియు గరికపాటి జ్ఞాననిధి లాంటివి ఇండియా పాడ్‌కాస్ట్‌ చార్ట్‌లోనే టాప్‌గా ఉన్నాయి. ఇంకా తెలుగు స్టోరీస్‌ మరియు స్పాటిఫై ఎక్స్‌క్లూజివ్‌లు అయినటువంటి బాల్‌గాధ- తెలుగు స్టోరీస్‌ మరియు లైఫ్‌టైమ్‌:విశ్వ విఖ్యాత ఎన్టీఆర్‌ లాంటివి కూడా చార్ట్‌లో టాప్‌లిస్ట్‌లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments