భద్ర ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్, డిఫరెంట్ జోనర్ చిత్రాలను భారీ స్థాయిలో నిర్మించడానికి ముందుకు వస్తోంది. ఈ నిర్మాణ సంస్థ ఆసక్తికరమైన చిత్రాలను రూపొందించనుంది. అందులో భాగంగా ఈరోజు ఈ బ్యానర్‌లో చేయబోతున్న ప్రొడక్షన్ నెం.1ను బుధవారం ప్రకటించారు. న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
శ్రీనివాస్ రాజు అందరికీ నచ్చేలా వైవిధ్యమైన కథాంశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. 100% లవ్ సినిమా కెమెరామెన్ వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి గ్యారీ బి.హెచ్ ఎడిటర్. త్వరలోనే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శ్రీనివాస్ రాజు, బ్యానర్: భద్ర ప్రొడక్షన్స్, సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్(100%లవ్),
ఎడిటర్: గ్యారీ బి.హెచ్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్స్: వెంకట్, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్