Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదు భాషల్లో దెయ్యంతో సహజీవనం టీజర్ విడుదల

Advertiesment
ఐదు భాషల్లో దెయ్యంతో సహజీవనం టీజర్ విడుదల
, బుధవారం, 4 ఆగస్టు 2021 (17:50 IST)
Nutty Karuna
నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవన). కీలక పాత్రలో రాజీవ్ సాలూరు నటించారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన ఈ చిత్రం టీజర్లను బుధవారం విడుదల చేశారు.
 
నట్టి కుమార్ మాట్లాడుతూ, యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేదాన్ని చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని మలిచాం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్ గా ఓ పవర్ ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో నటించింది’ అని అన్నారు.
 
హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ, అంచనాలకు తగ్గట్టు చిత్రం చాలా బాగా వచ్చింద‌ని అన్నారు.
నిర్మాత నట్టి క్రాంతి మాట్లాడుతూ, నేటి ట్రెండ్ కు తగ్గట్టు విభిన్నంగా నిర్మించిన హారర్ చిత్రమిది. త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రాఫర్: వెంకట హనుమ నరిసెటి, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి. రమణ, నిర్మాత: నట్టి క్రాంతి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆచార్య దాదాపు పూర్తి- ఇర‌వైనుంచి చిరు, చ‌ర‌ణ్ పై పాట చిత్రీక‌ర‌ణ‌