ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ కథానాయికగా నటిస్తున్న చిత్రం DSJ (దెయ్యంతో సహజీవనం). నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 12న ఈ చిత్రంలోని మొదటి పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలకానుంది.
దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ, బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని ఆ నలుగురు అబ్బాయిలపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం నడుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నిర్మాతగా నా కుమారుడు నట్టి క్రాంతి, కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కరోనా టైంలో కూడా నటీనటులందరు భయపడకుండా మాకు సహరించడం వలన మేము ఈ సినిమా పూర్తి చేయగలిగాము. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.
నిర్మాత నట్టి క్రాంతి మాట్లాడుతూ, నట్టి కరుణ ఆర్టిస్టుగానే కాకుండా గతంలో తను చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. డైనమిక్ నిర్మాతగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ చిత్రంలోని నటీనటులందరూ బాగా నటించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నట్టి కరుణ నటన సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది. సెకెండ్ లీడ్ లో సుపూర్ణ మాలకర్ నటించారు. కరోనా టైం లో కూడా ఏంతో ధైర్యంగా కశ్మీర్ లోని అందమైన లోకేషన్స్ లలో చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చామని అన్నారు..
ఇంకా ఈ సినిమాలో రాజీవ్, హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు నటించారు.
కెమెరామెన్: కోటేశ్వర రావు, సంగీతం: రవి శంకర్ఎ, డిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: కెవి.రమణ.