Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

కోవిడ్‌ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు బూస్టర్‌ డోస్‌లు అందిస్తున్న హీల్ఫా హెల్త్‌ ఏటీఎంలు

Advertiesment
ealpha Health ATMs
, బుధవారం, 4 ఆగస్టు 2021 (18:21 IST)
హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ హీల్ఫా నేడు తమ వర్ట్యువల్‌ క్లీనిక్‌ను హెల్త్‌ ఏటీఎం శీర్షికన ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ హెల్త్‌ ఏటీఎంలు కోవిడ్‌ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు నగర, గ్రామీణ ప్రాంతాలలో భారీ సంఖ్యలో ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా వర్ట్యువల్‌ క్లీనిక్స్‌ ద్వారా సహాయపడనున్నాయి.
 
నివారణ, నిర్వహణ, చికిత్సపరంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో విజయవంతమైన హీల్ఫా, కోవిడ్‌ అత్యవసర పరిస్థితులలో వేలాది కుటుంబాలకు, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు విజయవంతంగా చికిత్సనందించింది. ఇప్పుడు అదే తరహా ప్రయోజనాలను దేశవ్యాప్తంగా తమ పాకెట్‌ క్లీనిక్‌ శక్తివంతమైన హెల్త్‌ ఏటీఎంల ద్వారా కోవిడ్‌తో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలకూ చికిత్సనందిస్తూ ఆ ప్రయోజనాన్ని అందించడం లక్ష్యంగా చేసుకుంది.
 
హీల్ఫా ఫౌండర్‌ రాజ్‌ జనపరెడ్డి మాట్లాడుతూ, ‘‘2019లో 11% మాత్రమే టెలిమెడిసన్‌ వినియోగిస్తే ఇప్పుడు దాదాపు 76% మంది వినియోగదారులు టెలిమెడిసన్‌ వినియోగపు సౌకర్యం అనుభవిస్తున్నారు. మా హెల్త్‌ ఏటీఎంలు ఇప్పుడు టెలి చికిత్సను మరో దశకు తీసుకువెళ్తున్నాయి. దీనిలో భాగంగా డాక్టర్లు ఎక్కడి నుంచైనా రోగి యొక్క ఆక్సిజన్‌ శాచురేషన్‌, రక్తపోటు, గ్లూకోజ్‌ స్ధాయిలతో పాటుగా ఈసీజీ కూడా పరిశీలించగలరు. అత్యవసర శాఖలు (ఈడీ) సందర్శనలు, అత్యవసర రోగి సందర్శనలు, సమయాతీత కన్సల్టేషన్స్‌ అవసరాన్ని గణనీయంగా ఆన్‌ డిమాండ్‌ వర్ట్యువల్‌ అర్జెంట్‌ కేర్‌ తీర్చగల సామర్థ్యం ఉంది. తద్వారా హెల్త్‌కేర్‌ వర్కర్లతో పాటుగా రోగులు సైతం కోవిడ్‌ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి’’ అని అన్నారు
 
ఆయనే మాట్లాడుతూ, ‘‘హెల్త్‌ ఏటీఏంలను గురించి సరిగ్గా చెప్పాలంటే ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచి అయినా, అందుబాటుధరలలో ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయి. దీనిని పక్కనే ఉన్న మెడికల్‌ స్టోర్లు, పాఠశాలలు, కార్పోరేట్‌ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు ఆఖరకు పడవలలో సైతం ఏర్పాటుచేసి మారుమూల ప్రాంతలను సైతం చేరుకోవచ్చు. ఇది కేవలం నాలుగు చదరపు అడుగుల స్థలం మాత్రమే తీసుకుంటుంది. దేశంలో రోగి-డాక్టర్‌ రేషియో సమతుల్యతకు సైతం ఇది తోడ్పడనుంది’’ అని జనపరెడ్డి అన్నారు. హీల్ఫాను అత్యంత సౌకర్యవంతంగా వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌  చేయవచ్చు. ఇది ప్రభావవంతమైన, అతి తక్కువ ఖర్చుతో కూడిన సంరక్షణను అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాలకల "టీ"తో నూతనోత్సాహం.. నీరసాన్ని పోగొట్టి ఆకలిని..?