Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాదములతో ప్రీడయాబెటీస్‌తో బాధపడుతున్న యువతలో బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయి మెరుగు

Advertiesment
Almonds
, బుధవారం, 7 జులై 2021 (17:20 IST)
గత 40 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా  నాలుగు రెట్లు పెరిగింది. రోజు రోజుకీ పైపైకి పెరుగుతున్న ఈ కేసుల సంఖ్య భారతదేశంలో మరింత ఎక్కువగా ఉంది. నిజానికి, భారతీయులలో ప్రీ డయాబెటీస్‌ నుంచి  టైప్‌ 2 మధుమేహంగా వృద్ధి చెందడం ఎక్కువగా ఉంది (దాదాపు 14-18%). జీవనశైలి మార్పుల ద్వారా ఈ ధోరణిని అడ్డుకోవచ్చు.
 
స్నాక్‌ ప్రాధాన్యతల దగ్గరకు వచ్చేసరికి, బాదములు అతి సులభమైన, రుచికరమైన మరియు ఆహార వ్యూహంగా నిలుస్తాయి. బాదములను స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల  భారతదేశంలో ప్రీ డయాబెటీస్‌ దశలోని కౌమారదశ  మరియు యువతలో గ్లూకోజ్‌ మెటబాలిజం వృద్ధి చెందుతుందని ఓ నూతన అధ్యయనం వెల్లడించింది.
 
బాదములను తీసుకోవడం వల్ల  బ్లడ్‌ గ్లూకోజ్‌, లిపిడ్స్‌, ఇన్సులిన్‌ సహా జీర్ణక్రియ పనిచేయకపోవడం పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది క్లీనికల్‌ ట్రయల్స్‌ చేయడం ద్వారా కనుగొనే ప్రయత్నం చేశారు. ముంబైలో ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న కౌమారదశ బాలలు మరియు యుక్త వయసు వారు (16–25 సంవత్సరాలు)పై ఈ అధ్యయనం చేశారు. ర్యాండమ్‌గా, ప్రీ డయాబెటీస్‌ దశలో ఉన్న 275 మంది అభ్యర్థులు (56 మంది పురుషులు, 216 మంది స్త్రీలు) పై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఆరంభంలో, ఎంపిక చేసిన అభ్యర్థుల బరువు, ఎత్తు, నడుమ చుట్టు కొలత, హిప్‌ చుట్టుకొలత తీసుకోవడంతో పాటుగా ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ నమూనాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులకు గ్లూకోజ్‌ టోలరెన్స్‌ పరీక్షలు, లిపిడ్‌ ప్రొఫైల్స్‌ పరీక్షలను సైతం చేయడం జరిగింది.
 
బాదముల గ్రూప్‌ (107 మంది) 56 గ్రాములు (దాదాపు 340 కేలరీలు) రోస్ట్‌ చేయని బాదములను ప్రతి రోజూ మూడు నెలల పాటు తీసుకున్నారు. ఇక నియంత్రిత బృందం (112 మంది) అదే తరహా కేలరీలు కలిగిన రుచికరమైన స్నాక్‌ తీసుకున్నారు.  అధ్యయనంలో  పాల్గొన్న వ్యక్తులు తీసుకునే మొత్తం కేలరీలలో 20% వాటాను బాదములు లేదా భారతదేశంలో ఈ వయసులో తీసుకునే రుచికరమైన స్నాక్స్‌ ద్వారా లభించే కేలరీలు  ఆక్రమించాయి.
 
ఈ అధ్యయన కాలమంతా కూడా పాల్గొన్న అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ అధ్యయనం చివరలో అభ్యర్థులు తీసుకోవాల్సిన రీతిలో ఆహారం తీసుకుంటున్నారని నిర్ధారించుకున్న తరువాత రక్తపరీక్షలను మరో మారు చేశారు.
 
బాదములు  తీసుకున్న వారిలో హెచ్‌బీఏ1సీ స్థాయిలు నియంత్రిత గ్రూప్‌తో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. ప్రీ-డయాబెటీస్‌ దశలో బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పెరగడం వల్ల మధుమేహ నివారణ సాధ్యం కావడం లేదా అభివృద్ధిని ఆలస్యం చేయడం సాధ్యమవుతుంది. అదనంగా, బాదములను తీసుకోవడం వల్ల టోటల్‌ కొలెస్ట్రాల్‌ మరియు చెడు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ గణనీయంగా కంట్రోల్‌ గ్రూప్‌తో పోల్చినప్పుడు తగ్గింది. అదేసమయంలో చక్కటి హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్ధాయిలను నిర్వహించడమూ జరిగింది.
 
అలాగే బరువు, ఎత్తు, నడుం లేదా హిప్‌ చుట్టుకొలత లేదా బయో కెమికల్‌ మార్కర్లు పరంగా ఎలాంటి మార్పులనూ గమనించలేదు. ఇన్‌ఫ్లమ్మెటరీ మార్కర్లు (టీఎన్‌ఎఫ్‌-ఆల్ఫా మరియు ఐఎల్‌-6) బాదముల గ్రూప్‌లో తగ్గాయి, నియంత్రిత గ్రూప్‌లో పెరిగాయి. కాకపోతే గణాంకపరంగా దీనిలో పెద్దగా మార్పులేదు. ఇంటర్వెన్షన్‌ తరువాత బాదముల గ్రూప్‌తో పోల్చినప్పుడు ఫాస్టింగ్‌ గ్లూకోజ్‌ లెవల్స్‌ నియంత్రిత గ్రూప్‌లో గణనీయంగా తగ్గాయి. బాదములను తీసుకున్న బృందంలో, ఎఫ్‌జీఃఎఫ్‌1 రేషియో తగ్గింది. అదేసమయంలో నియంత్రిత గ్రూప్‌లో అది పెరిగింది కానీ గణాంకపరంగా అది చెప్పుకోతగ్గది కాదు.
 
‘‘మెరుగైన పౌష్టికాహారం మరియు వ్యాయామాలు సహా జీవనశైలి మార్పులు వంటివి కౌమార దశ వయసుతో పాటుగా యుక్త వయసులోని పెద్దలలో ప్రీ డయాబెటీస్‌ నుంచి టైప్‌ 2 డయాబెటస్‌గా మారడం నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ అధ్యయనంలోని ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం ఈ మార్పులను గణనీయంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి రోజూ రెండు పూటలా బాదములు తీసుకోవడం వల్ల కూడా పెనుమార్పుకు కారణమవుతుంది. ఈ అధ్యయన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీనిలో ఏ విధంగా టోటల్‌ మరియు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గుతుందో చూపడంతో పాటుగా హెచ్‌బీఏ1సీ స్థాయిలు కూడా ఏ విధంగా కేవలం 12 వారాల వినియోగంతో తగ్గాయో వెల్లడించింది’’ అని ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్‌ జగ్మీత్‌ మదన్‌, పీహెచ్‌డీ, ప్రొఫెసర్‌ –ప్రిన్సిపాల్‌, శ్రీ  విఠల్‌దాస్‌ ఠాకర్‌సీ  కాలేజీ ఆఫ్‌ హోమ్‌ సైన్స్‌ (అటానమస్‌), ఎస్‌ఎన్‌డీటీ ఉమెన్స్‌ యూనివర్శిటీ (ముంబై) అన్నారు.
 
ఈ అధ్యయనానికీ పరిమితులున్నాయి. ఇతర వయసు తరగతులు, విభిన్నమైన జాతులపై బాదములను ఆరగించడం వల్ల కలిగే ఫలితాలను గురించి పరిశోధన చేయాల్సి ఉంది. ఈ అధ్యయనం, యువతలో బాదములు తీసుకోవడం  వల్ల కలిగే సంభావ్య మార్పులపై చేసిన మరో అధ్యయనంకు సమానంగా ఉంటుంది. యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా మెర్సెడ్‌లో పరిశోధకులు కనుగొన్న దాని ప్రకారం బాదములు తీసుకోవడం వల్ల టోటల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గడంతో పాటుగా ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు కూడా మెరుగయ్యాయి. 8 వారాల పాటు చేసిన ఈ అధ్యయనంలో బాదములను స్నాక్స్‌గా తీసుకున్న వారిలో హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్ధాయి మెరుగవడంతో పాటుగా బ్లడ్‌ షుగర్‌ నియంత్రణ కూడా సాధ్యమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా వంశీప్రియారెడ్డి