Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 February 2025
webdunia

పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల్లో ఇందువ‌ద‌న

Advertiesment
పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల్లో ఇందువ‌ద‌న
, బుధవారం, 4 ఆగస్టు 2021 (18:03 IST)
Varun Sandesh, Shetty pharnaj
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ఇందువ‌ద‌న. ఎం.ఎస్‌.ఆర్‌. ద‌ర్శ‌కుడు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్.  ఇందువదన ఫస్ట్ లుక్, వ‌రుణ్ సందేశ్, ఫ‌ర్నాజ్ శెట్టి క్యారెక్ట‌ర్స్ ఇంట్రో లుక్స్ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన ల‌భించింది, అలానే ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ యూ ట్యూబ్ లో మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా చార్ట్ బ‌స్ట‌ర్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కె. రాఘ‌వేంద్ర‌రావు విడుద‌ల చేసిన టీజ‌ర్ ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుండ‌టం విశేషం. ఈ టీజ‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది.  ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మ‌ర‌ళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్య‌త‌లు తీసుకున్నారు.
 
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ఈ మధ్య నేను సినిమా చేస్తే మా తాతయ్య  చూడలనుకున్నాడు. కానీ మా తాతయ్య లాస్ట్ ఇయర్ చనిపోయాడు..ఈ చిత్రం బాగా వచ్చింది. ఇందులో ఫ‌ర్నాజ్ చాలా బోల్డ్‌గా న‌టించింది. పాత్ర‌ప‌రంగా ఆమె ఇందులో జీవించింది. ఆమె బిజీ న‌టి అవ్వాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు.
 
దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ఇందువ‌ద‌న చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్తై ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన విడుద‌ల తేదీతో పాటు మ‌రిన్ని వివ‌రాలు ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదు భాషల్లో దెయ్యంతో సహజీవనం టీజర్ విడుదల