భారీ నష్టాలను చవిచూసిన భారత మార్కెట్లు

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:32 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ పేలవంగా స్టార్ట్ అయ్యాయి. వాల్ స్ట్రీట్‌, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు అందడంతో.. భారత మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇవాళ ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయింది. 50,184 పాయింట్ల వద్ద ట్రేడ్ అయిన సెన్సెక్స్‌.. సుమారు 480 పాయింట్లు కోల్పోయింది. 
 
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నిఫ్టీ కూడా ట్రేడింగ్‌లో సతమతమైంది. 283 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.. ఓ దశలో 14,835 వద్ద ట్రేడ్ అయ్యింది. మూడవ క్వార్టర్‌కు సంబంధించిన జీడీపీని నేషనల్ స్టాటిస్‌టికల్ ఆఫీసు రిలీజ్ చేయనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. అమెరికాలోని వాల్‌స్ట్రీట్ మార్కెట్ ప్రభావం ఆసియా మార్కెట్‌పై పడింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా ఇవాళ నష్టాలను ఎదుర్కొవాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments