Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తర కొరియా.. ఇప్పుడు కిమ్ భార్య కనిపించలేదట..

Advertiesment
ఉత్తర కొరియా.. ఇప్పుడు కిమ్ భార్య కనిపించలేదట..
, బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (13:37 IST)
Kim Wife
ఉత్తర కొరియాలో ఎప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారో.. ఎవరు మాయమవుతారో తెలియదు. కొన్నాళ్లు కిమ్‌ కనిపించక పోతే.. మరికొన్నాళ్లు కిమ్‌ సోదరి కనిపించరు.. వీరిద్దరు కాకపోతే కిమ్‌ భార్య కనిపించరు. ఆ తర్వాత ఎప్పుడో మళ్లీ బాహ్య ప్రపంచం ముందుకొచ్చి ఆశ్చర్యపరుస్తారు. ఈలోపు రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తాయి. 
 
ఈ సారి కిమ్‌ భార్య రి సోల్‌-జు వంతు వచ్చింది. ఏడాది పాటు అజ్ఞాతంలో ఉన్న ఆమె తాజాగా బాహ్య ప్రపంచం ముందుకొచ్చారు. మంగళవారం తన భర్త కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో కలిసి తన మామ దివంగత కిమ్‌జోంగ్‌ ఇల్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
 
కిమ్‌ దంపతులు మేన్సుడే ఆర్ట్‌ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎవరూ మాస్కులు ధరించకపోవడం గమనార్హం. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు కిమ్‌ ది కుమ్సాన్‌ ప్యాలెస్‌ ఆఫ్‌ ది సన్‌లో తన తండ్రి, తాతల సమాధులను దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమాలను రిపోర్టు చేసిన ఉత్తరకొరియా మీడియా కిమ్‌ను మరోసారి ప్రెసిడెంట్‌ అని సంబోధించడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంకు పెట్టెలో కరెన్సీ నోట్లు.. ఐదు లక్షలు చెదల పాలు.. ఎక్కడ?