Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ గుడ్ న్యూస్.. రూ.35 లక్షల వరకు నిమిషాల్లో లోన్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (19:27 IST)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. 'రియల్‌టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్' పేరుతో కొత్త తరహా పర్సనల్ లోన్ ప్రొడక్ట్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సిబ్బంది కోసం ఈ పర్సనల్ లోన్ ఆఫర్ ప్రకటించింది. 
 
వీరంతా బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొన్ని నిమిషాల్లోనే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ హిస్టరీ వివరాలు, అర్హత, డాక్యుమెంటేషన్, లోన్ మంజూరు ప్రాసెస్ మొత్తం డిజిటల్ పద్ధతిలో రియల్‌టైమ్‌లో జరిగిపోతుంది. ఇప్పటికే యోనో యాప్‌లో కస్టమర్లు అందరికీ ఎస్‌బీఐ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అందిస్తున్న సంగతి తెలిసిందే.  
 
ఎస్‌బీఐ అందిస్తున్న రియల్‌టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ (ఆర్టీఎక్స్‌సీ) తీసుకోవాలనుకునేవారు యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అర్హులైన వారికి రూ.35 లక్షల వరకు లోన్ నిమిషాల్లో మంజూరవుతుంది. పర్సనల్ లోన్ అప్లికేషన్ నుంచి లోన్ అకౌంట్లో జమ కావడం వరకు 100 శాతం పేపర్‌లెస్, డిజిటల్ పద్ధతిలో పూర్తవుతుంది. 
 
ప్రస్తుతం యోనో ఎస్‌బీఐ ఆండ్రాయిడ్ యాప్‌లో మాత్రమే ఈ సదుపాయం ఉంది. రియల్‌టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు తక్కువ అని ఎస్‌బీఐ ప్రకటించింది. 
 
డిజిటల్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ పద్ధతి ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిజిటల్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒకసారి బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments